Rain Alert : ఏపీలోని ఆ 10 జిల్లాలకు వర్షసూచన.. తెలంగాణలో మరో 2 రోజులు వానలు
Rain Alert : వచ్చే రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది.
- By Pasha Published Date - 07:51 AM, Tue - 19 September 23
Rain Alert : వచ్చే రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది. హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సిటీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉంది. ఇక తెలంగాణలో పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3.1 డిగ్రీలు పెరిగి, 36 డిగ్రీల సెల్సియస్ దాకా చేరుతాయని తెలిపింది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
Also read : Chandrayaan Ganapathi : ‘చంద్రయాన్-3’ గణపతుల సందడి.. ఫొటోలు వైరల్
ఆంధ్రప్రదేశ్ లో ఇలా..
ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వానలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో సాయంకాలం నుంచి రాత్రి వరకు వర్షాలు పడొచ్చు. ఇవాళ సాయంకాలం విశాఖ నగరంలో అక్కడక్కడ వర్షాలు (Rain Alert) పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాత్రి సమయానికి చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ.. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని పలు భాగాల్లో వర్షాలు పడనున్నాయి.
Related News
Rains Alert: చల్లని కబురు.. తెలంగాణలోని 14 జిల్లాల్లో వర్షాలు
తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 29న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.