CM Revanth Reddy : BRS నేతలకు అసలు సినిమా ఏంటో చూపిస్తా – సీఎం రేవంత్
CM Revanth Reddy : ఎవరు అడ్డుకున్నా బుల్డోజర్లతో తొక్కుకుపోయి పనులు చేయిస్తామన్నారు
- By Sudheer Published Date - 07:35 PM, Fri - 8 November 24

బీఆర్ఎస్ నేతలకు (BRS Leaders) ఈరోజు ట్రైలర్ (Trailer) మాత్రమే చుపించానని, త్వరలోనే సినిమా చూపిస్తానని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు తన పుట్టినరోజు (Revanth Reddy Birthday) సందర్బంగా మూసీ నది పరివాహక ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఈ సమావేశంలో మాట్లాడుతూ.. మూసీ (Musi) పరివాహక ప్రాంత ప్రజలు ఫ్లోరైడ్ సమస్యతో ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యల నేపథ్యంలో మహిళలు మరియు చిన్న పిల్లలు కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాలుష్య ప్రభావం వల్ల ఇక్కడి రైతులు వ్యవసాయం మానేసి వలసలు వెళ్ళే పరిస్థితికి చేరారని, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేసిందని తెలిపారు. ఎవరు అడ్డువచ్చినా మూసీ పునరుజ్జీవాన్ని నిలిపివేయలేరని, ప్రజల కష్టాలు తుడిచేందుకు తెలంగాణ బిడ్డగా తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈరోజు ఎవరో అధికారం ఇస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదని, ప్రజల ఓట్ల తో విజయం సాధించామన్నారు. ఇక జనవరి మొదటి వారంలో వాడపల్లి వద్ద పాదయాత్ర ప్రారంభిస్తానని, ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందంటూ బిఆర్ఎస్ నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ అన్నారు.
మూసి ప్రాజెక్టులో కాలుష్యం అణుబాంబు కంటే ప్రమాదకరమని, అణుబాంబు పేలితే ఎంత నష్టం జరుగుతుందో మూసిస నదిలో కాలుష్యం వల్ల అంత కంటే ఎక్కువ నష్టం జరుగుతుందని అన్నారు. ముఫ్పై రోజుల్లో మూసి ప్రక్షాళన ప్రాజెక్టు డిజైన్లు ఖరారు అవుతాయన్నారు. ఎవరు అడ్డుకున్నా బుల్డోజర్లతో తొక్కుకుపోయి పనులు చేయిస్తామన్నారు. కేసీఆర్,కేటీఆర్, హరీష్ దమ్ముంటే మూసి ప్రక్షాళన ప్రాజెక్టు ఆపేందుకు ప్రయత్నించాలని సవాల్ చేశారు. కమీషన్ల కోసమే మూసీ ప్రాజెక్టు చేపట్టానని బీఆర్ఎస్ అంటోందని .. తనకు కమిషన్లే కావాలనుకుంటే ధరణిలో బీఆర్ఎస్ వాళ్లు చేసినట్లే చేస్తే చాలని వ్యాఖ్యానించారు.
మూసి ప్రక్షాళన అడ్డుకుంటే నల్లగొండ ప్రజలతో వచ్చి మీపై బుల్డోజర్లు తీసుకెళ్లకపోతే నేను పేరు మార్చుకుంటానని రేవంత్ హెచ్చరించారు. బుల్డోజర్లకు అడ్డుపడతామని మాట్లాడుతున్న బిల్లా రంగాలు.. ధైర్యం ఉంటే తారీఖు చెప్పండి.. మా వెంకన్నను బుల్డోజర్ పై ఎక్కిస్తా… మా ఎమ్మెల్యే సామెల్ తో జెండా ఊపిస్తానని సవాల్ చేశారు. మూడు నెలలు జైలుకు పోతేనే నీకు దుఃఖం వస్తే… మూసీ పరివాహక బిడ్డల జీవితాలు పోతుంటే నీకు పట్టదా అని ప్రశ్నించారు. నల్లగొండ ప్రజలు నీకు ఓట్లు వేయలేదనా కేసీఆర్ ?మూసీ ప్రక్షాళన అడ్డుకోవాలని చూస్తున్నావ్ నల్లగొండ జిల్లా పౌరుషాల గడ్డ… మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే మూసీలోనే పాతరేస్తారని హెచ్చరించారు.