Hydra : ‘హైడ్రా’ పేరు చెప్పి డబ్బుల వసూళ్ల కు పాల్పడితే జైలుకే – హైడ్రా కమిషనర్
ఎవరైనా కూడా హైడ్రా పేరుతొ బెదిరింపులకు పాల్పడుతూ డబ్బు కావాలని ఒత్తిడి చేస్తే తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్,లో గాని ఎస్పీ, సిపికి గాని లేదా హైడ్రా కమిషనర్, ఏసిబికి కూడా ఫిర్యాదు చేయాలని
- By Sudheer Published Date - 02:49 PM, Wed - 4 September 24
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా హైడ్రా (Hydra ) పేరు మారుమోగిపోతుంది. అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ (CM Revanth) ఉక్కుపాదం మోపుతూ..హైడ్రా ను రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో జనాభా పెరిగిపోతుండడంతో ఇష్టాను సారంగా చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జా చేసి అక్రమాలు నిర్మాణాలు చేపడుతున్నారు. సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఇన్నాళ్లూ ఆక్రమణదారులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగింది. కానీ ఇప్పుడు హైడ్రా రావడంతో నగర పరిధిలో చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో బడా ప్రముఖుల అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా..వందలమందికి నోటీసులు జారీ చేసారు. ఈ క్రమంలో కొంతమంది కేటుగాళ్లు హైడ్రా పేరు చెప్పి అమాయకపు ప్రజల నుండి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మీ ఇల్లు అక్రమ నిర్మాణంలో ఉంది..హైడ్రా నోటీసుకు మీ పేరు వచ్చింది. మీ ఇల్లు కూల్చకుండా ఉండాలంటే మాకు కొంత డబ్బు చెల్లించుకోవాలి..లేదంటే మీ ఇల్లు కూల్చేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్ పరిధిలో లేదా వాటి పరిసరాల్లో నిర్మాణం చేపడుతున్న బిల్డర్ల ను ఇది అక్రమ నిర్మాణమని, బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్ పరిధిలో నిర్మిస్తున్నారని హైడ్రా కు ఫిర్యాదు చేస్తామని, అలాగే అధికారులతో వున్న ఫోటోలు చూపించి హైడ్రా విభాగంలోని ఉన్నతాధికారులతో తమకు పరిచయాలు వున్నాయని, మీకు ఎలాంటి సమస్య రాకుండా చేస్తామని ఇందుకోసం కొంత డబ్బు ముట్టజెప్పాల్సిందిని..లేదంటే హైడ్రా కు ఫిర్యాదు చేస్తామని కొద్ది మంది వ్యక్తులు, సంస్థలు బిల్డర్లను బెదిరింపులు పాల్పడటంతో పాటు గత కొద్దికాలంగా బహుళ అంతస్తుల్లో, వ్యక్తిగత గృహల్లో నివాసం వుంటున్న వారి వద్ద ఇలాంటి బెదిరింపులకు పాల్పడం జరుగుతోంది. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాధ్ సీరియస్ అయ్యారు.
ఎవరైనా మిమ్మల్ని ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నా , ఇతర ప్రభుత్వ విభాగలైన రెవిన్యూ, మున్సిపల్, నీటి పారుదల విభాగాలతో పాటు హైడ్రా విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది సైతం ఎవరైనా కూడా హైడ్రా పేరుతొ బెదిరింపులకు పాల్పడుతూ డబ్బు కావాలని ఒత్తిడి చేస్తే తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్,లో గాని ఎస్పీ, సిపికి గాని లేదా హైడ్రా కమిషనర్, ఏసిబికి కూడా ఫిర్యాదు చేయాలని, రాష్ట్రప్రభుత్వం, ముఖ్యమంత్రి మంచి ఉద్యేశాలతో ఈ హైడ్రా విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని. ఎవరైనా ఈ విభాగాన్ని నీరుగార్చే ప్రయత్నాలు గాని, తప్పు దోవ పట్టించే విధంగా యత్నించే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని, ఈ విభాగంపేరుతో ఎవరైనా వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం డబ్బు వసూళ్ల చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరమైన తీసుకోబడుతాని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు.
ఈ బెదిరింపు వసూళ్లకు సంబంధించి సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ ప్రాంతానికి చెందిన డా. విప్లవ్ సామాజిక కార్యకర్త ముసుగులో స్థానిక బిల్డర్ ను డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా సదరు బాధిత బిల్డర్ గత సోమవారం రోజున హైడ్రా కమిషనర్ కలుసుకొని ఫిర్యాదు చేసాడు. ఈ ఫిర్యాదును పరిశీలించిన వాస్తవాలు గ్రహించి అనంతరం హైడ్రా కమిషనర్ సూచన మేరకు ఎస్పీ సంగారెడ్డి బాధిత బిల్డర్ నుండి ఫిర్యాదు స్వీకరించారు. ఈ ఫిర్యాదుతో ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు హైడ్రా పేరుతొ బెదిరింపులకు పాల్పడుతున్న డా. విప్లవ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు.
Read Also : Flood Damage : వరద నష్టాన్ని అంచనా వేసిన తెలంగాణ ప్రభుత్వం..కేంద్రానికి రిపోర్టు
Related News
Gurram Cheruvu Disappearing: గుర్రం చెరువును మింగేసిన రియల్టర్లు
Gurram Cheruvu Disappearing:బాలాపూర్ మండలంలోని ప్రధాన సరస్సులలో ఒకటైన గుర్రం చెరువు 90 ఎకరాలకు పైగా ఉన్నట్లు అధికారికంగా అందరికీ తెలుసు. కానీ దశాబ్ద కాలంలోనే దాని పరిమాణంలో దాదాపు మూడింట ఒక వంతుకు కుంచించుకుపోయింది. దీనివల్ల నీటి వనరులు దాదాపుగా కనుమరుగయ్యాయి.