HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >If We Stop The Welfare Programs We Will Dry Up The Congress Government Ktr

KTR: సంక్షేమ కార్యక్రమాలను ఆపితే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతాం: కేటీఆర్

  • Author : Balu J Date : 08-01-2024 - 5:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr Response On Assembly El
Ktr Response On Assembly El

KTR: పేద ప్రజల కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యత నిర్వహిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు తెలిపారు. 50 సంవత్సరాల పాటు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ కూడా పేద ప్రజల కోసం విప్లవాత్మకమైన, వినూత్నమైన కార్యక్రమాలను అమలు చేసేందుకు కూడా ఆలోచన చేసే సహాసం చేయలేదన్న కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన దళిత బంధు, గృహలక్ష్మి, బీసీ బందు, గొర్రెల పంపిణీ వంటి కార్యక్రమాల అమలును నిలిపివేసే కుట్రను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పాలనలో ఆర్థిక స్వావలంబనకు, అభివృద్ధికి నోచుకోలేని దళిత కుటుంబాల అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు కార్యక్రమాన్ని తాము ప్రారంభించామన్నారు.

దళితులను కేలం ఒటు బ్యాంకుగా చూసిన కాంగ్రెస్, ఎన్నికల సందర్భంగా దళిత బందును 10 లక్షల నుంచి 12 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ , దాన్ని మరిచిపోయిందన్నారు. ఇప్పటకే ఎంపిక చేసిన దళిత బంధు లబ్ధిదారులను అనేక ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. దళిత బంధు కోసం లబ్ధిదారులు బ్యాంకుల్లో ప్రారంభించిన బ్యాంకు అకౌంట్లను ప్రభుత్వం ఫ్రీజ్ చేస్తుందన్నారు. దీంతోపాటు గొర్రెల పంపిణీ కోసం తమ వాటాలుగా డీడీలు కట్టిన వారిని పట్టించుకోవడం లేదన్నారు. నియోజకవర్గానికి మూడు వేల మందికి గృహలక్ష్మి పథకాన్ని అమలు చేయడంలో భాగంగా తమ ప్రభుత్వం లబ్ధిదారులను గుర్తించి వారికి అవసరమైన ప్రొసీడింగ్స్ ని అందించిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ విధంగా పేదలు దళితులు, బీసీల ప్రయోజనాలను దెబ్బకొట్టేలా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా వారికి అండగా నిలుస్తామన్నారు.

కేవలం ఎన్నికల కోసం అడ్డగోలుగా వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు శ్వేత పత్రాలు, అప్పుల పేరుతో నాటకాలు ఆడుతుందన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీ సభసాక్షిగా నిరుద్యోగ భృతికి కాంగ్రెస్ హామీ ఇవ్వలేదని అబద్ధాలు చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం 6 గ్యారెంటీ ల పేరుతో తప్పించుకోవడానికి చూస్తే ఊరుకునేదే లేదని కేటీఆర్ హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తామని కేటీఆర్ తెలిపారు.

గతంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి లైన్లలో నిలబెట్టకుండానే ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలను వారి ఇంటి ముందుకి తీసుకెళ్లి ఇచ్చిన పరిస్థితి ఉంటే, ఈ రోజు ప్రతి ఒక్క ప్రభుత్వ పథకానికి ప్రజలందరినీ లైన్లలో నిల్చోబెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు కేటీఆర్. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజలను ఇబ్బంది పెట్టేలా లైన్లో నిలబెడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అస్థవ్యస్ద పనితీరు, పరిపాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయని తెలియజేశారు. ఈరోజు తెలంగాణ భవన్లో జరిగిన నిజామాబాద్ లోక్సభ సన్నాహక సమావేశంలో హాజరైన నాయకులను పార్టీ శ్రేణులను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • hard comments
  • ktr
  • TCongress

Related News

Revanth Speech

CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. ఉచిత విద్యుత్, వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల వ్యవహారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.  ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతుందనితేల్చి చెప్పారు.ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభు

  • KTR- Harish Rao

    BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

Latest News

  • IPL 2026: ఆర్సీబీకి వరుసగా రెండోసారి ఐపీఎల్‌ టైటిల్‌

  • IPL 2026 : ఐపీఎల్ 2026 హీరో.. నూనుగు మీసాల కుర్రాడి రికార్డులు ఇవే

  • GT : గుజ‌రాత్ టైటాన్స్ టీమ్‌కు త‌ప్పిన పెనుప్ర‌మాదం

  • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd