HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >If Bjp Loves Women It Should Pass Womens Bill Kavitha

Kavitha Deeksha: మహిళలపై చిత్తశుద్ది ఉంటే.. వెంటనే బిల్లు పాస్ చేయాలి: కవిత

బీజేపీకి పూర్తి మెజార్టీ ఉందన్న మహిళా బిల్లు ఆమోదం పొందే వరకు కొనసాగుతుందని కవిత చెప్పారు.

  • Author : Balu J Date : 10-03-2023 - 2:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kavitha
Kavitha

మహిళలు పరిపాలనలో భాగస్వామ్యం కావాలని, అన్ని రంగాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌దే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలనే డిమాండ్‌ తో ఢిల్లీ (Delhi)లోని జంతర్ మంతర్ వద్ద బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) దీక్ష చేపట్టారు. ఉదయం 10గంటలకు ప్రారంభమైన ఈ దీక్షకు భారీగా మహిళా నేతలు తరలి వచ్చారు. సాయంత్రం 4 వరకు కవిత ఇక్కడ నిరాహార దీక్ష చేస్తారు. దీక్ష ప్రారంభోత్సవానికి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కవిత (MLC Kavitha) దీక్షకు 18 రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. దీక్ష ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సహా ఇతర పార్టీల మహిళా నేతలు కవిత వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. ఆమెతోపాటు కూర్చుని ప్లకార్డులు చేతబట్టుకుని నినాదాలు చేశారు. పార్లమెంట్ లో మహిళా బిల్లు ప్రవేశ పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు మహిళా నేతలు. బీజేపీకి నిజంగా మహిళలపై ప్రేమ, మహిళా బిల్లు ఆమోదంపై చిత్తశుద్ధి ఉంటే.. పార్లమెంట్‌ లో మహిళా బిల్లు ఆమోదం పొందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు కవిత (MLC Kavitha).

బీజేపీ (BJP)కి పార్లమెంట్‌ లో పూర్తి మెజార్టీ ఉందన్న ఆమె, మహిళా బిల్లు ఆమోదం పొందే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. తమ బాధ్యత మేరకు ఒత్తిడి తెస్తున్నామని, బీజేపీకి హామీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఉభయ సభల్లో మెజార్టీ ఉన్నప్పటికీ బిల్లుని ఎందుకు ఆమోదించడంలేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు మహిళా నేతలు.

Also Read: Sreeleela With Balakrishna: బాలకృష్ణ చేయి పట్టుకున్న శ్రీలీల.. NBK 108లోకి ఎంట్రీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS MLC
  • delhi
  • kavitha
  • reservation
  • women

Related News

Kavita Fire

Kavitha : కాంగ్రెస్ సర్కార్ తీరుపై కవిత ఆగ్రహం

ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల భూబాధితుల సమస్య ఇప్పుడు రాజకీయ సెగలు రేపుతోంది. బాధితులకు అండగా నిలుస్తూ భారత్ రాష్ట్ర సమితి (BRS) నాయకురాలు, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది

    Latest News

    • Jobs : నిరుద్యోగులకు గొప్ప శుభవార్త.. రైల్వేలో వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!

    • Ustaad Bhagat Singh : తెలంగాణ లో సాధారణ టికెట్ ధరలతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’

    • Donald Trump : ట్రంప్ కు మరో భారీ షాక్

    • Uttam : రబీ ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

    • Physics Wala : ఆంధ్రప్రదేశ్‌లో తొలి టెక్-ఎనేబుల్డ్ విద్యాపీఠ్ ప్రారంభం

    Trending News

      • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

      • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

      • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

      • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd