Vishnuvardhan Reddy: జూబ్లీహిల్స్ బరిలో విష్ణువర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ కు అల్టీమేటం!
కాంగ్రెస్ విడుదల చేసిన రెండో జాబితాలో పలువురు కాంగ్రెస్ నేతల పేర్లు లేకపోవడం చర్చనీయాంశమవుతోంది.
- By Balu J Published Date - 01:50 PM, Sat - 28 October 23

Vishnuvardhan Reddy: కాంగ్రెస్ విడుదల చేసిన రెండో జాబితాలో పలువురు కాంగ్రెస్ నేతల పేర్లు లేకపోవడం చర్చనీయాంశమవుతోంది. టికెట్ ఆశించిన చాలామంది నేతలకు భంగపాటు ఎదురైంది. ఈ నేపథ్యంలో పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డికి కూడా కాంగ్రెస్ అధిష్టానం హ్యండ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియా ముందుకొచ్చి సంచలన కామెంట్స్ చేశారు.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ తనకు దక్కకపోవడంపై PJR కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ జూబ్లీహిల్స్లోనే పోటీ చేస్తా.. కొందరు హాఫ్ టికెట్ గాళ్లకు సీట్లు ఇచ్చారు. సిటీలో కాంగ్రెస్కు ఒకే సీటు వస్తుందని సర్వేలు చెప్పాయి. ఇప్పుడు ఆ అవకాశం కూడా పోయింది. పార్టీ కోసం ఏళ్లుగా ఎంతో కష్టపడ్డాను. ఢిల్లీ వెళ్లి దండాలు పెట్టిన వాళ్లకే టికెట్లు ఇచ్చారు’ అని విష్ణు ఆరోపించారు.
Also Read: AP Politics: వైసీపీ పొలిటికల్ థ్రిల్లర్, చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్