పేదలకు బ్రాండ్ అంబాసిడర్ ఉంటా.. కేసీఆర్ ను గద్దెదింపుతా!
తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల భూమి నోచుకోని దళితులకు.. డబుల్ బెడ్ ఇళ్లు అందని అర్హులైన పేదలకు.. సీఎం పదవికి నోచుకోని దళితులకు అండగా ఉంటానని, అవసరమైతే వాళ్లందరి పక్షాన బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ 32వ రోజు సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
- By Balu J Published Date - 03:28 PM, Fri - 1 October 21

తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల భూమి నోచుకోని దళితులకు.. డబుల్ బెడ్ ఇళ్లు అందని అర్హులైన పేదలకు.. సీఎం పదవికి నోచుకోని దళితులకు అండగా ఉంటానని, అవసరమైతే వాళ్లందరి పక్షాన బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ 32వ రోజు సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
గత ఏడేళ్లలో వర్షాల కారణంగా వేలాది మంది రైతులు ఆర్థికంగా నష్టపోయారని, కేసీఆర్ ప్రభుత్వం ఏ ఒక్క రైతుకూ పరిహారం చెలించలేదని ఆరోపించారు. అనేక సమస్యలతో కొట్టామిట్టాడుతున్న రైతాంగానికి కేంద్రం అవసరమైన సాయం చేసిందని, కేవలం రైతుల కోసమే మోడీ ప్రభుత్వం ‘ఫసల్ భీమా యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టిందని బండి సంజయ్ గుర్తు చేశారు. నేటికీ రుణమాఫీ కాని రైతుల కోసం, సీఎం పదవిని పొందలేని దళితుల పక్షాన నిలబడుతానని బండి వ్యాఖ్యానించారు.
తెలంగాణ రైతుల నుంచి బియ్యం కొనుగోలు చేయడానికి కేంద్రం నిరాకరించిందని టీఆర్ఎస్ ప్రభుత్వం అసత్యాలను ప్రచారం చేస్తోందని.. ఒకవేళ కేంద్రం ప్రభుత్వం నిరాకరిస్తే కేసీఆర్ రుజువు చేయాలని డిమాండ్ చేశారు. వేలాది మంది విద్యార్థుల పోరాటంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులు, రైతులు, యువతను నిట్టనిలువునా మోసం చేసిందని విమర్శించారు. ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ వెంట బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ రాజ్ కుమార్ చాహర్, సీనియర్ నాయకులు ఎస్. బాబు రావు, మనోహర్ రెడ్డి, జి ప్రేమందర్ రెడ్డి, రాకేష్ రెడ్డి, ఎన్ వి సుభాష్ ఉన్నారు.
Related News

Karnataka Polls: ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లపై అమిత్ షా హాట్ కామెంట్స్
ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అధికార పార్టీ బిజెపి, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో దూకుడు పెంచాయి