Hyd : భూకబ్జాదారుల నుండి 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
Hyd : మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం విలేజ్‌లో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది
- By Sudheer Published Date - 01:03 PM, Wed - 7 May 25

హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపులో హైడ్రా కీలక పాత్ర పోషిస్తోంది. గతంలో పరిష్కారం కాకపోయిన సమస్యలపై హైడ్రా వేగంగా స్పందిస్తుండటంతో ప్రజల్లో సంస్థపై విశ్వాసం పెరుగుతుంది. తాజాగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని గాజులరామారం గ్రామంలో సర్వే నంబర్ 354లోని 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంది. ఇందులో 5 ఎకరాల భూమిని కేఎల్ యూనివర్సిటీ ఆక్రమించిందని గుర్తించి, అక్కడి అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వానికి తిరిగి అప్పగించింది.
ఈ చర్యలు హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి నేతృత్వంలో జరిగాయి. ఆయన స్వయంగా రంగంలోకి దిగిన తర్వాత అధికారులు ఆక్రమిత ప్రాంతాన్ని పరిశీలించి, ప్రభుత్వ భూమిగా గుర్తించి అక్కడ ఫెన్సింగ్, హెచ్చరికా బోర్డులు ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో కాటేదాన్, గచ్చిబౌలి, ఇందిరా సొసైటీ కాలనీల్లో రహదారులపై జరిగిన ఆక్రమణలను తొలగించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇరుకుగా మారిన రహదారులు మళ్లీ విస్తరించడంతో, ప్రజల రాకపోకలకు అనుకూలంగా మారింది.
Onion: వామ్మో ఉల్లిపాయ వల్ల కలిగే లాభాలు తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!
ప్రజావాణి ద్వారా హైడ్రాకు వచ్చే ఫిర్యాదుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సామాజిక కోణంలో ఆలోచించే వ్యక్తుల నుంచి అధికంగా ఫిర్యాదులు రావడం గమనార్హం. ఇటీవల 54 ఫిర్యాదులపై హైడ్రా ఫైర్ విభాగం అదనపు సంచాలకులు వర్ల పాపయ్య పరిశీలన చేపట్టి, శాటిలైట్ ఇమేజ్‌లు, గూగుల్ మ్యాప్స్ ఆధారంగా నిశితంగా పరిశీలించి తగిన చర్యలు చేపట్టారు. దీనితో ప్రజలు కూడా తమ సమాజ భద్రత కోసం స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో హైడ్రా ప్రజలతో కలిసి నడుస్తూ మంచి ఫలితాలు సాధిస్తోంది.
15 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
గాజులరామారంలో ఆక్రమణలను తొలగించిన హైడ్రా🔶 మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం విలేజ్‌లో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. సర్వే నంబరు 354లో ఉన్న ప్రభుత్వ భూమిలో కబ్జాలను హైడ్రా మంగ… pic.twitter.com/nrRsnRQ3gj
— HYDRAA (@Comm_HYDRAA) May 6, 2025