Warning : హైదరాబాద్ వాసులారా.. ఈ చికెన్ తింటే నేరుగా హాస్పటల్ కే..!!!
Warning : సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బేగంపేట అన్నానగర్‌లో టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా
- By Sudheer Published Date - 01:44 PM, Fri - 14 February 25

హైదరాబాద్ (Hyderabad) నగరంలో కుళ్లిన చికెన్ (Rotten Chicken) విక్రయం వెలుగులోకి వచ్చి అందర్నీ భయబ్రాంతులకు గురి చేసింది. ఇప్పటికే బర్డ్ ఫ్లూ (Bird Flu ) భయం తొలగకముందే, నిల్వ ఉంచిన పాడైపోయిన చికెన్ విక్రయిస్తున్న సమాచారం బయటకు రావడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బేగంపేట అన్నానగర్‌లో టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, రెండు చికెన్ షాపుల్లో భారీగా కుళ్లిన మాంసం బయటపడింది. తనిఖీల్లో భాగంగా అధికారులకు 600 కిలోల కుళ్లిన చికెన్ పట్టుబడింది. దీనిని చాలా రోజులుగా నిల్వ ఉంచి, అతి తక్కువ ధరలకు మద్యం షాపులు, బార్లకు విక్రయిస్తున్నట్లు తేలింది. దీనితో సంబంధం ఉన్న షాపులను సీజ్ చేయడంతో పాటు, యజమానులకు నోటీసులు జారీ చేశారు. పట్టుబడ్డ మాంసాన్ని అధికారులు డంపింగ్ యార్డులో పాతిపెట్టారు.
Vijay : హీరో విజయ్‌కి వై ప్లస్ కేటగిరీ భద్రత
ఇప్పటికే తెలంగాణలో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో, పాడైపోయిన మాంసం విక్రయించడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిల్వ ఉంచిన చికెన్‌ను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తీవ్రంగా పెరిగే ప్రమాదం ఉంది. గతంలో కూడా ఇలాంటి కేసులు బయటపడినా, కొందరు వ్యాపారులు మారడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతర తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
#Hyderabad :#Hyderabadi be Alert may be you having Rotten Chicken 🍗 with Wine 🥂!
A large quantity of #RottenChicken was found stored in cold storages of #Chicken centers at #AnnaNagar , #Begumpet in #Secunderabad.
In a joint operation, the #FoodSafety department… pic.twitter.com/74SVuLqVdu
— Surya Reddy (@jsuryareddy) February 14, 2025