HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Hyderabad Water Blockade Today Because Of Cm Revanth

Floods In HYD : సీఎం రేవంత్ వల్లే నేడు హైదరాబాద్ జ‌ల దిగ్బంధం – హరీష్ రావు

Floods In HYD : సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) రాజకీయాలు పక్కన పెట్టి వరదలో చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, పరిసర ప్రాంత ప్రజలను తరలించి వారికి పూర్తి సహాయం అందించాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు

  • Author : Sudheer Date : 27-09-2025 - 12:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harishrao Hyd Floods
Harishrao Hyd Floods

తీవ్ర వర్షాలు, వరదలతో హైదరాబాద్ (Hyderabad) నగరం జల దిగ్బంధంలో చిక్కుకున్న నేపథ్యంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వాతావరణ శాఖ ముందుగానే భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించకపోవడం దుర్మార్గమని, ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ అని హరీశ్‌రావు మండిపడ్డారు. వరద అంచనా వేయడంలో, ముందస్తు ప్రణాళికలు రూపొందించడంలో, విభాగాల మధ్య సమన్వయం సాధించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు.

IPS Transfer : తెలంగాణ లో 23 మంది ఐపీఎస్‌లు బ‌దిలీ

హరీశ్‌రావు (Harishrao) మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే ఎంజీబీఎస్ బస్టాండ్‌లో ప్రయాణికులు వరద నీటిలో చిక్కుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, పండుగ సీజన్‌లో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు భయంతో రాత్రంతా పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. మూసీ నది ప్రమాదకరంగా ఉప్పొంగుతున్న కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించి ప్రజలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని హరీశ్‌రావు అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) రాజకీయాలు పక్కన పెట్టి వరదలో చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, పరిసర ప్రాంత ప్రజలను తరలించి వారికి పూర్తి సహాయం అందించాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు ఈ వర్షాలు, వరదల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని, అధికార యంత్రాంగం సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • Floods In HYD
  • harish rao
  • hyderabad
  • rains

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

  • Telangana's debt stands at a staggering Rs 8.21 lakh crore; Bhatti Vikramarka lashes out at BRS.

    Bhatti Vikramarka: తెలంగాణ అప్పు అక్షరాలా రూ.8.21 లక్షల కోట్లు.. బీఆర్‌ఎస్‌పై భట్టి విక్రమార్క ఫైర్

Latest News

  • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd