Housing Prices: పదేళ్లలో 13 శాతం పెరిగిన హైదరాబాద్ భూముల ధరలు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ గత తొమ్మిదేళ్లలో గణనీయంగా అభివృద్ధి చెందింది. దేశంలో ముంబై, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాలు అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నాయి.
- By Praveen Aluthuru Published Date - 11:17 AM, Fri - 16 June 23

Housing Prices: తెలంగాణ రాజధాని హైదరాబాద్ గత తొమ్మిదేళ్లలో గణనీయంగా అభివృద్ధి చెందింది. దేశంలో ముంబై, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాలు అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నాయి. అయితే హైదరాబాద్ ఇంతలా అభివృద్ధి చెందడానికి కారణం ఇక్కడున్న మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రా స్ట్రెచర్, వాతావరణ పరిస్థితులు. ఇక హైద్రాబాద్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గత పదేళ్లలో నగరంలో రియల్ ఎస్టేట్ భూమింగ్ లో ఉంది. విదేశీయులు నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వాల సహకారం కూడా ఉండటంతో గత పదేళ్ల కాలంలో నగరానికి అనేక ఐటీ సంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాలను నెలకొల్పాయి.
హైదరాబాద్ అభివృద్ధితో ఇక్కడ ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా ఐటీ ఊపందుకోవడంతో యువత నగరానికి వచ్చి స్థిరపడుతున్నారు. ఈ క్రమంలో ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో రియల్ వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. దీంతో ఇళ్ల ధరలు అమాంతం పెరిగాయి.
తాజాగా హౌసింగ్ ప్రైస్ ట్రాకర్ నివేదిక వెల్లడించింది. గత 9 త్రైమాసికాలుగా హైదరాబాద్‌లో గృహాల ధరలు (Housing Prices) స్థిరంగా పెరుగుతూ వస్తున్నాయి. హైదరాబాద్(Hyderabad)లో గృహాల ధరలు ఏడాది ప్రాతిపదికన 13 శాతం పెరిగాయి. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలలో, సెంట్రల్ హైదరాబాద్‌లో అత్యధికంగా 55 శాతం ధరలు పెరిగాయి. ఈ ధరల పెరుగుదలకు ఈ ప్రాంతంలో మెరుగైన మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రా స్ట్రెచర్. ఇక సెంట్రల్ హైదరాబాద్‌లో హిమాయత్ నగర్, సోమాజిగూడ, బేగంపేట్ మరియు అమీర్‌పేట్ ఉన్నాయి.
కరోనా తరువాత నగరంలో రియల్ భూమింగ్ మొదలైంది. కరోనా వల్ల ఎంత నష్టం జరిగినా.. రియల్ ఎస్టేట్ మాత్రం పుంజుకుంది. ఒక్కసారిగా భూముల ధరలు పెరిగాయి. కరోనా పాండమిక్ తో పోల్చి చూస్తే.. హైదరాబాద్‌లో గృహాల ధరలు 46 శాతం పెరిగాయి. కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, ఢిల్లీ , పూణే మరియు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ తో సహా భారతదేశంలోని మొదటి ఎనిమిది నగరాల్లో ఈ సంఖ్య అత్యధికం.