HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Hyderabad Ramanthapur Krishna Janmashtami Accident

Ramanthapur Incident : రామంతపూర్‌లో శోభాయాత్రలో విషాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

Ramanthapur Incident: హైదరాబాద్ నగరంలోని రామంతపూర్ గోఖలే నగర్‌లో జరిగిన శ్రీకృష్ణాష్టమి శోభాయాత్రలో విషాదం చోటుచేసుకుంది.

  • Author : Kavya Krishna Date : 18-08-2025 - 2:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ramanthapur Incident
Ramanthapur Incident

Ramanthapur Incident : హైదరాబాద్ నగరంలోని రామంతపూర్ గోఖలే నగర్‌లో జరిగిన శ్రీకృష్ణాష్టమి శోభాయాత్రలో విషాదం చోటుచేసుకుంది. భక్తి ఉత్సాహంతో సాగుతున్న రథోత్సవం క్షణాల్లోనే కరుణాకరమైన ఘటనగా మారింది. రథానికి విద్యుత్ తీగలు తాకడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని తక్షణమే సమీప ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అనూహ్యంగా జరిగిన ఈ ప్రమాదంతో మృతుల కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. వేడుకగా ప్రారంభమైన శోభాయాత్ర చివర్లోనే మరణ శోకంగా మారడం స్థానికులను కుదిపేసింది. మరోవైపు ఆసుపత్రి వద్ద గాయపడినవారి బంధువులు కన్నీరు మున్నీరుగా తమ వారి ఆరోగ్య సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. మంత్రి శ్రీధర్ బాబు మృతుల కుటుంబాలను కలిసి వారికి భరోసా ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, “ఈ సంఘటన చాలా బాధాకరం. చనిపోయిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తాం. గాయపడినవారి చికిత్స ఖర్చులను పూర్తిగా ప్రభుత్వం భరిస్తుంది” అని ప్రకటించారు.

JC Prabhakar Reddy: కేతిరెడ్డి పెద్దారెడ్డి దమ్ముంటే తాడిపత్రికి రా… తేల్చుకుందాం..

అలాగే ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, “మరికొన్ని వంద మీటర్ల దూరంలో శోభాయాత్ర ముగియబోతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరం” అన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, కేబుల్ వైర్ ద్వారా విద్యుత్ సరఫరా జరగడంతో రథానికి షాక్ తగిలి ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తుకు హైదరాబాద్ కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.

“దర్యాప్తు రిపోర్టు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడైనా కేబుల్ వైర్లు విద్యుత్ తీగలకు తాకే పరిస్థితులు లేకుండా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించాం” అని ఆయన స్పష్టం చేశారు. కృష్ణాష్టమి సందర్భంగా ప్రతి ఏటా రామంతపూర్ ప్రాంతంలో జరిగే శోభాయాత్రకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారు. ఈసారి కూడా ఉత్సాహంగా ప్రారంభమైన ఈ వేడుకలో కొద్దిపాటి నిర్లక్ష్యం ఐదుగురి ప్రాణాలను బలి తీసుకుంది. స్థానికుల ఆనందాన్ని ఈ ప్రమాదం ఒక్కసారిగా శోకంగా మార్చేసింది.

Krishna Ashtami : కృష్ణాష్టమి వేడుకల్లో అపశ్రుతి.. కరెంట్ షాక్ తో ఐదుగురు దుర్మరణం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • accident
  • hyderabad
  • Krishna Janmashtami
  • Ramantapur
  • telangana

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd