Hyderabad Police: ఫైళ్ల చోరీ కేసుల్లో మాజీ మంత్రుల ప్రమేయం ఉంటే చర్యలు!
బీఆర్ఎస్ మాజీ మంత్రుల కార్యాలయాల్లో పలు ఫైళ్లు మాయమైన సంగతి తెలిసిందే.
- By Balu J Published Date - 12:36 PM, Tue - 12 December 23

Hyderabad Police: తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పలువురు మాజీ మంత్రుల కార్యాలయాల్లో కీలక ఫైళ్ల చోరీకి గురైన విషయం తెలిసిందే. అయితే ఈ ఫిర్యాదులపై విచారణ కొనసాగుతూనే ఉంది. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసినట్లు జిల్లా పోలీసు కమిషనర్ (డీసీపీ, సెంట్రల్) డి శ్రీనివాస్ తెలిపారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) కార్యాలయంలో ఫైళ్లు మాయమైనట్లు ఆరోపణలు వచ్చాయి. కళ్యాణ్ పై కూడా ఆరోపణలున్నాయి.
‘‘కల్యాణ్‌తో పాటు ఇతర అధికారులను ప్రశ్నించి స్టేట్‌మెంట్ రికార్డు చేస్తాం. అలాగే మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కార్యాలయాల్లో ఫర్నీచర్ మిస్సింగ్‌పై కేసు నమోదు చేశాం. అలాగే మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయంలోని అల్మారా మిస్సింగ్‌పై కేసు నమోదు చేశాం. వారి ప్రమేయం ఉంటే చర్యలు తీసుకుంటాం’ అని సీనియర్ హైదరాబాద్ పోలీసు అధికారి తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి సిబ్బంది కార్యాలయాల్లోని ఫైళ్లు, ఫర్నీచర్ దొంగిలించి రవాణా చేస్తున్నారంటూ నాంపల్లి, సైఫాబాద్, అబిద్‌రోడ్ పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి.
Also Read: Jr Ntr: ఎన్టీఆర్ పై వార్2 ఎఫెక్ట్.. స్పీడ్ తగ్గిన ‘దేవర’ షూటింగ్