KCR Health Condition: కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఈరోజు ఎలా ఉందంటే.. నిన్నటి కంటే భిన్నంగా బీఆర్ఎస్ బాస్!
యశోద ఆసుపత్రిలో సాధారణ వైద్య పరీక్షల కోసం చేరిన తర్వాత ఆయనను పరామర్శించడానికి వచ్చిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఇష్టాగోష్టి నిర్వహించారు.
- Author : Gopichand
Date : 04-07-2025 - 6:25 IST
Published By : Hashtagu Telugu Desk
KCR Health Condition: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR Health Condition) ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆయన స్వల్ప జ్వరం, అధిక బ్లడ్ షుగర్, తక్కువ సోడియం స్థాయిలతో హైదరాబాద్‌లోని సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో గురువారం చేరిన విషయం తెలిసిందే. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు పేర్కొంది. ఆయన కుమారుడు కేటీఆర్ మాట్లాడుతూ.. ఇది సాధారణ వైద్య పరీక్షల కోసం జరిగిన చేరిక అని, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏవీ లేవని తెలిపారు. ఇకపోతే ఆయన ఆరోగ్యం పట్ల బీఆర్ఎస్ నేతలు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Jamie Smith- Prasidh Krishna: ఇదేం బౌలింగ్ ప్రసిద్ధ్.. ఓకే ఓవర్‌లో 23 పరుగులు ఇవ్వటం ఏంటీ సామీ!
సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం యశోదా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పలువురు పార్టీ నేతలు పరామర్శించేందుకు వచ్చారు.
ఈ సందర్భంలో.. వారితో అధినేత ఇష్టాగోష్టి నిర్వహించారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా ఎరువుల… pic.twitter.com/k3Pn1DGGx9
— BRS Party (@BRSparty) July 4, 2025
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆరోగ్యంపై బీఆర్ఎస్ వర్గాలు తాజాగా పేర్కొన్నారు. యశోద ఆసుపత్రిలో సాధారణ వైద్య పరీక్షల కోసం చేరిన తర్వాత ఆయనను పరామర్శించడానికి వచ్చిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు, ఇతర ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. కేసీఆర్ పార్టీ నేతలు, ఉద్యమకారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. తద్వారా పార్టీ భవిష్యత్తు వ్యూహాలను బలోపేతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, శుక్రవారం డిశ్చార్జ్ కావచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.