Hyd Cops Warning: అలాంటి పోస్టులు పెడితే అరెస్టులే!
మత సామరస్యానికి పేరుగాంచిన హైదరాబాద్‌లో ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
- By Balu J Updated On - 04:32 PM, Fri - 2 September 22

మత సామరస్యానికి పేరుగాంచిన హైదరాబాద్‌లో ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రవక్తపై అతని వ్యాఖ్యలు అనేక నిరసనలకు దారితీశాయి. దీంతో రాజాసింగ్ పై PD యాక్టు కింద అరెస్టు చేశారు. ఎమ్మెల్యే అరెస్ట్‌తో వర్గాల మధ్య విద్వేషాలు సృష్టించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హైదరాబాద్ పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజా సింగ్ తల నరికేస్తానని బెదిరించిన ముస్లిం వ్యక్తిని అరెస్టు చేశారు. హైదరాబాద్ పోలీసులు రెండు, మూడు అరెస్టులు చేసినప్పటికీ, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్ట్‌లతో అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి.
సోషల్ మీడియా పోస్టులను గమనించిన హైదరాబాద్ పోలీసులు అలాంటి వారిని వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఇటీవల ఓ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో పోస్టులను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, ఎవరైనా పోస్టులు, ఘాటు వ్యాఖ్యలు చేస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియా పోస్ట్‌లను పరిశీలించేందుకు ‘సోషల్ మీడియా యాక్షన్ స్క్వాడ్‘లను ఏర్పాటు చేశామని, ప్రతి పోస్ట్, వ్యాఖ్యను పరిశీలిస్తామని, ఏవైనా ఉల్లంఘనలు తేలితే, అలాంటి పోస్ట్‌లు చేసే వారిని అరెస్టు చేస్తామని సీవీ ఆనంద్ చెప్పారు.
Related News

6 Chain Snatchings: రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్.. హైదరాబాద్ లో 6 చోట్ల స్నాచింగ్స్
హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఆరు చోట్ల స్నాచింగ్‌లకు పాల్పడ్డారు.