Hyderabad : రెండు కేజీల గంజాయితో పట్టుబడ్డ రౌడీ షీటర్
హైదరాబాద్ మంగళ్‌హాట్‌లో రెండు కేజీల గంజాయితో రౌడీ షీటర్ పోలీసులకు పట్టుబడ్డాడు. మన్‌మోహన్‌సింగ్ (43) అనే వ్యక్తిని
- By Prasad Published Date - 07:16 AM, Sat - 4 March 23

హైదరాబాద్ మంగళ్‌హాట్‌లో రెండు కేజీల గంజాయితో రౌడీ షీటర్ పోలీసులకు పట్టుబడ్డాడు. మన్‌మోహన్‌సింగ్ (43) అనే వ్యక్తిని మంగళ్‌హాట్ పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా గంజాయితో పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పేరుమోసిన రౌడీషీటర్ అయిన మన్‌మోహన్ సింగ్ సూర్యాపేట ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేశాడని.. గంజాయి విక్రయించేందుకు బలరాం గల్లీ రోడ్డుపై వేచి ఉండగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మంగళ్‌హాట్ పోలీసులు అతనిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ 1985 కింద కేసు నమోదు చేశారు. గంజాయి కేసుల్లో చిక్కుకోవడం వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలియకుండానే చాలా మంది కొత్త నేరస్థులు సులువుగా డబ్బు సంపాదించేందుకు గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. గంజాయి కేసుల్లో చిక్కుకుంటే కనీస శిక్ష రూ. 10,000 జరిమానాతో పాటు 1 సంవత్సరం కఠిన శిక్ష, గరిష్టంగా రూ. 1 లక్ష జరిమానాతో పాటు గరిష్టంగా 20 సంవత్సరాల కఠిన శిక్ష ఉంటుందని పోలీసులు తెలిపారు.

Related News

Hyderabad Police: సెలబ్రిటీల ఫొటోలు మార్ఫింగ్ చేసి ట్రోల్ చేస్తే జైలుకే
8మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో 30మంది ట్రోలర్స్ కి నోటీసులిచ్చారు.