Praja Bhavan : చలిలో కూడా ప్రజాభవన్ వద్ద బారులు తీరిన జనం
- By Sudheer Published Date - 02:48 PM, Fri - 22 December 23

మంగళవారం , శుక్రవారం వచ్చిందంటే చాలు ప్రజా భవన్ కిటకిటలాడుతుంది. రాష్ట్రంలోనూ మారుమూల నుండి సైతం ప్రజలు తమ పిర్యాదులు , సమస్యలు చెప్పుకునేందుకు ప్రజా భవన్ కు చేరుకుంటున్నారు. గత కొద్దీ రోజులుగా రాష్ట్రంలో విపరీతమైన చలి ఉంది..అయినాసరే చలిని లెక్కచేయకుండా ఉదయం 4 గంటలకే భారీ ఎత్తున ప్రజలు క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. ఈరోజు కూడా అదే జరిగింది. క్యూలో ప్రజలు ఎక్కువ సేపు ఉండకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రజావాణి కార్యక్రమం ఉదయం 4.30 గంటల నుంచే మొదలైంది. వచ్చిన వారి వినతులను అధికారులు వెంటనే స్వీకరిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఉద్యోగుల బదిలీలు, పెన్షన్లు, భూకబ్జాలు, డబుల్ బెడ్రూమ్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం (BRS Govt)లో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని… సమస్యలతో సతమతమయ్యారని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) భావిస్తోంది. దీంతో ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు ప్రజావాణి కార్యక్రమం చేపట్టింది. ప్రగతిభవన్‌ను జ్యోతిరావ్ పూలే ప్రజాభవన్‌గా పేరు మార్చి… అక్కడే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి మొదటి నుంచి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజావాణి కార్యక్రమానికి తరలివస్తున్నారు.
చలిలో కూడా ప్రజాభవన్ వద్ద బారులు తీరిన జనం
వివిధ జిల్లాల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం చలిలో ఉదయం 4 గంటల నుంచే బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద ప్రజలు బారులు తీరారు.. కాగా రోజూ ప్రజాదర్బార్ జరుగుతుందని ప్రకటించి, ఇప్పుడు ప్రతి మంగళవారం, శుక్రవారం మాత్రమే ఉంటుందని అక్కడ బోర్డు… pic.twitter.com/juRdL1WPcg
— Telugu Scribe (@TeluguScribe) December 22, 2023
Read Also : Salaar : హైదరాబాద్ లో సలార్ షో నిలిపివేత..ఆగ్రహం లో ఫ్యాన్స్