Health Tips: ఈ 5 రకాల పండ్లు షుగర్ పేషెంట్ లకు మేలు చేస్తాయని మీకు తెలుసా?
ఈ రోజుల్లో చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ డయాబెటిస్ కారణంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటా
- By Anshu Published Date - 09:48 PM, Tue - 18 June 24

ఈ రోజుల్లో చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ డయాబెటిస్ కారణంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం, తగ్గడం లాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. రక్తంలో షుగర్ లెవల్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే రకరకాల మెడిసిన్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే డయాబెటిస్ ఉన్నవారు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని అన్న కూడా సంకోచిస్తూ ఉంటారు.
కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ ఐదు రకాల పండ్లు షుగర్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తాయి అంటున్నారు వైద్యులు. ఇంతకీ ఆ పండ్లు ఏమిటో వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మధుమేహ వ్యాధిగ్రస్తులు పీచు పండ్లను తినచ్చు. పీచు పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది మధుమేహ వ్యాధి గ్రస్తులకు మేలు చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు నేరేడు పండ్లు తినవచ్చు. నేరేడు పండ్లను తినడం వల్ల మధుమేహం కంట్రోల్ అవుతుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ చేయడంలో నేరేడు పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి.
కనుక మధుమేహం వ్యాధిగ్రస్తులు నేరేడు పండ్లను తినవచ్చు. అలాగే షుగర్ ఉన్నవారు జామపండ్లను తినొచ్చు. ఎందుకంటే దీనిలో తక్కువ కేలరీలు ఫైబర్ రక్తంలోని చక్కెరను నియంత్రణలో ఉంచడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. కకాబట్టి మధుమేహ ఉన్నవారు జామపండ్లను నిస్సంకోచంగా తినవచ్చు. షుగర్ వ్యాధిగ్రస్తులు బొప్పాయి పండు తింటే మేలు జరుగుతుంది. ప్రతి రోజు బొప్పాయి పండ్లను తినడం వల్ల రక్తంలో చక్కెర కంట్రోల్లో ఉంటుంది. అలాగే ప్రతి రోజూ ఒక ఆపిల్ తినడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. ఆపిల్ ఎవరు తిన్నా కూడా అందరికీ మేలు చేస్తుంది.