42% Backward Class Quota : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కు భారీ దెబ్బ
42% Backward Class Quota : ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేయడంతో, హైకోర్టు ఆదేశాలు చెల్లుబాటుగా మిగిలాయి. ఇది తెలంగాణ ప్రభుత్వానికి రాజకీయంగా కూడా పెద్ద దెబ్బగా భావిస్తున్నారు
- By Sudheer Published Date - 03:52 PM, Thu - 16 October 25

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి సుప్రీంకోర్టు పెద్ద ఎదురుదెబ్బ ఇచ్చింది. అక్టోబర్ 16న సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మేహతాల బెంచ్ ముందు విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వమే హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌పై దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అంటే, హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక నిలుపుదల ఆదేశాలు అలాగే కొనసాగుతాయని స్పష్టం చేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న తాజా జీఓ అమలుపై తాత్కాలికంగా ఆంక్షలు కొనసాగుతున్నాయి.
Konda Surekha Resign : కొండా సురేఖ రాజీనామా చేస్తారా?
తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 9న ప్రభుత్వం జారీ చేసిన ఆర్డర్‌పై స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26, 2025న బీసీల రిజర్వేషన్ల శాతాన్ని 42%కి పెంచుతూ ఆర్డర్ జారీ చేసింది. అయితే, పలు పిటిషనర్లు ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేశారు. వారంటూ మొత్తం రిజర్వేషన్ల శాతం 67%కు చేరుతుందని, ఇది సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితిని దాటుతోందని వాదించారు. ఈ వాదనలను పరిశీలించిన హైకోర్టు, ప్రభుత్వం నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ, తాత్కాలికంగా ఆర్డర్‌పై స్టే విధించింది.
ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేయడంతో, హైకోర్టు ఆదేశాలు చెల్లుబాటుగా మిగిలాయి. ఇది తెలంగాణ ప్రభుత్వానికి రాజకీయంగా కూడా పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల పెంపును ప్రభుత్వ ప్రధాన రాజకీయ వాగ్దానంగా తీసుకెళ్లిన కాంగ్రెస్‌కు ఇది ఇబ్బందికర పరిణామం. ఇకపై హైకోర్టులో విచారణ కొనసాగి, తుది తీర్పు వచ్చే వరకు రిజర్వేషన్ పెంపు జీఓ అమలులోకి రాకపోవడం ఖాయమైంది. ఈ తీర్పుతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై కూడా తాత్కాలిక అనిశ్చితి నెలకొంది.