HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Will Konda Surekha Resign

Konda Surekha Resign : కొండా సురేఖ రాజీనామా చేస్తారా?

Konda Surekha Resign : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల జరిగిన టెండర్ వివాదం, దానిపై ఆమె కుమార్తె సుస్మిత చేసిన సంచలన ఆరోపణల నేపథ్యంలో, మంత్రి కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేయనున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది

  • Author : Sudheer Date : 16-10-2025 - 1:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Konda Surekha
Konda Surekha

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల జరిగిన టెండర్ వివాదం, దానిపై ఆమె కుమార్తె సుస్మిత చేసిన సంచలన ఆరోపణల నేపథ్యంలో, మంత్రి కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేయనున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆమెను రాజీనామా చేయాలని సూచించిందని తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన లేకపోయినా, సురేఖకు అత్యంత సన్నిహితులైన నేతలు ఈ వార్తను ధృవీకరిస్తున్నారు. పార్టీ లోపల పెరుగుతున్న అంతర్గత విభేదాలు, ముఖ్యంగా మంత్రులు పొంగులేటి మధుసూదన్‌రెడ్డి, కడియం శ్రీహరి తదితరులతో తలెత్తిన విభేధాలు ఈ పరిణామాలకు దారితీశాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

సురేఖ నివాసం వద్ద జరిగిన భద్రతా చర్యల మార్పులు కూడా ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి. హన్మకొండలోని ఆమె ఇంటి వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, పోలీస్ ఔట్‌పోస్ట్‌ను తొలగించడం, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. సాధారణంగా మంత్రి స్థాయి వ్యక్తుల ఇళ్ల వద్ద భద్రతా సదుపాయాలను ఎప్పుడు తగ్గించరు. కానీ ఇప్పుడు ఆ ఏర్పాట్లు తొలగించడంతో, అధికార వర్గాల్లో “ఆమె పదవి ప్రమాదంలో ఉందా?” అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇదే సమయంలో, కొండా సురేఖ తన కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న ఆరోపణలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.

అయితే సురేఖను సులభంగా పదవి నుంచి తొలగించడం కాంగ్రెస్‌కు అంత తేలిక కాదు. ఆమె BC వర్గానికి చెందిన ప్రముఖ నాయకురాలు, వరంగల్ జిల్లా రాజకీయాల్లో బలమైన ఆధారమున్న వ్యక్తి. ఇటువంటి సమయాల్లో ఆమెను పక్కన పెట్టడం పార్టీకి పెద్ద రాజకీయ మైనస్ అవుతుందని అంచనా. ముఖ్యంగా బీసీ ఓటర్లలో ఇప్పటికే అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యలో, అధిష్ఠానం నిర్ణయం పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే రాబోయే రోజుల్లో సురేఖ భవితవ్యంపై పార్టీ ఉన్నత నాయకత్వం జాగ్రత్తగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • controversy
  • Konda Surekha
  • Konda Surekha Resign
  • lands
  • ponguleti

Related News

Bcm Temple

Bhadrachalam Temple : రామయ్య గోత్ర నామాల వివాదంపై హైకోర్టు క్లారిటీ

ఇరుపక్షాల వాదనలను సుదీర్ఘంగా విన్న హైకోర్టు, తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. భద్రాచలం ఆలయానికి ఉన్న విశిష్టత, భక్తుల నమ్మకాలు మరియు చారిత్రక ఆధారాలను బేరీజు వేస్తూ న్యాయస్థానం

    Latest News

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • కనిష్ట స్థాయికి ప‌డిపోయిన రూపాయి విలువ‌!

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • TVK Candidate List 2026 : త్రిష చెప్పిన వారికే విజయ్ టికెట్స్ ఇచ్చాడా ?

    • ఈటీవీ భార‌త్ సంస్థ‌కు క్ష‌మాప‌ణ‌లు!

    Trending News

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

      • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

      • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

      • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd