HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >How Do Bangladeshis Enter Hyderabad Illegally

Bangladeshis : హైదరాబాద్​లోకి అక్రమంగా బంగ్లాదేశీయులు .. ఎలా వస్తున్నారంటే ?

బంగ్లాదేశీయులు మన హైదరాబాద్ సిటీలోనూ  చాలామందే ఉన్నారు. వారంతా నగరంలో వివిధ పనులు చేస్తూ ఉపాధి పొందుతుంటారు.

  • Author : Pasha Date : 08-08-2024 - 11:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
How Do Bangladeshis Enter Hyderabad

Bangladeshis : బంగ్లాదేశీయులు మన హైదరాబాద్ సిటీలోనూ  చాలామందే ఉన్నారు. వారంతా నగరంలో వివిధ పనులు చేస్తూ ఉపాధి పొందుతుంటారు. ప్రత్యేకించి చిరు వ్యాపారాలు చేస్తుంటారు. పరిశ్రమలలో, భవన నిర్మాణ పనుల్లో కార్మికులుగా వర్క్ చేస్తారు. అయితే వీరిలో కొందరు అక్రమంగా మన దేశంలోకి వచ్చినవారే కావడం గమనార్హం. ఇంతకీ బంగ్లాదేశీయులు అక్రమ మార్గాల్లో హైదరాబాద్ దాకా ఎలా వస్తున్నారు ?

We’re now on WhatsApp. Click to Join

వాస్తవానికి బంగ్లాదేశీయులు ప్రధానంగా ఉపాధి కోసమే భారత్‌కు వస్తుంటారు. అక్కడితో పోలిస్తే మన దేశంలో వేతనాలు ఎక్కువగా ఉంటాయి. వాటికి ఆశపడి వారు ఇండియాకు వస్తుంటారు. ఇలా బంగ్లాదేశ్(Bangladeshis) నుంచి భారత్‌కు వచ్చే వారికి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌‌లలోని ఏజెంట్లు సహకరిస్తుంటారు. అక్రమంగా బంగ్లాదేశ్ బార్డర్‌ను దాటించి ఇండియా రైలులోకి ఎక్కించే బాధ్యతను ఏజెంట్లు తీసుకుంటారు. ఇందుకు ఆ ఏజెంట్లు ఒక్కో బంగ్లాదేశీయుడి నుంచి సగటు రూ.10వేల దాకా వసూలు చేస్తుంటారు. బంగ్లాదేశ్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా మీదుగా బార్డర్‌ను దాటించి కోల్‌కతాకు చేర్చే బాధ్యతను ఏజెంట్లు తీసుకుంటున్నారు. అనంతరం బంగ్లాదేశీయులు కోల్‌కతాకు చేరగానే వారికి నకిలీ ఆధార్,  ఓటరు గుర్తింపు కార్డులను తయారు చేసి అందిస్తున్నారు. వాటిని తీసుకొని సదరు బంగ్లాదేశీయులు రైలు మార్గంలో తెలంగాణలోని హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు.  ఈవిధంగా హైదరాబాద్‌కు చేరిన కొందరు బంగ్లాదేశీయులను తెలంగాణ పోలీసులు విచారించగా ఈవివరాలు వెల్లడయ్యాయి.

Also Read :Ukraine Attack : రష్యాలోకి ప్రవేశించిన ఉక్రెయిన్ ఆర్మీ.. సుడ్జా గ్యాస్‌ కేంద్రం స్వాధీనం.. రంగంలోకి పుతిన్

గత రెండేళ్ల వ్యవధిలోనే దాపు వెయ్యి మందికిపైగా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా హైదరాబాద్‌కు  వచ్చి ఉండొచ్చని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. వీరిని గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది అంటున్నారు. నిఘా వర్గాల హెచ్చరికలతో అక్రమ వలసదారులను గుర్తించే పనిని మొదలుపెట్టామని పోలీసులు పేర్కొంటున్నారు. ఈక్రమంలోనే గత కొన్ని రోజులుగా  బాలాపూర్, కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి, పహాడీషరీఫ్‌, ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Also Read :BSF Firing : బార్డర్‌లో బీఎస్ఎఫ్ కాల్పులు.. గుమిగూడిన బంగ్లాదేశీయులకు ఫైర్ వార్నింగ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bangladesh Crisis
  • Bangladeshis
  • hyderabad
  • illegal Entry

Related News

Hyderabad Minor Girl instagram Trap Case

డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

Hyderabad Minor Girl  ప్రేమ పేరుతో 20 మంది మైనర్ బాలికలను మోసగించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ధనవంతుడిగా నటిస్తూ అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం ఇతని శైలి అని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన డబ్బున్న బాలిక నుంచి రూ. 13 లక్షలు కాజేయడంతో పాటు మరో యువతిని శారీరక వేధింపులకు గురిచేసినట్లు తేలిం

  • Hyderabad Woman Disappears After Dispute Over Eating Curd

    పెరుగు తినమని చెప్పినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య

  • Dhoni Srh Match

    2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

  • Sanjana

    Actress Sajini : హైదరాబాద్‌లో మలయాళ నటిపై దాడి !!

  • LPL Financial opens first GCC outside US in Hyderabad

    హైదరాబాద్‌లో ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ భారీ పెట్టుబడి.

Latest News

  • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

  • Rajasthan : రేపు ప్రారంభం కాబోతున్న వేళ రూ.80,000 కోట్ల ప్రాజెక్టులో భారీ అగ్నిప్రమాదం

  • జపాన్‌లో భారీ భూకంపం!

  • మీరు చ‌క్కెర ఎక్కువ‌గా తింటున్నారా?

  • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

Trending News

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd