High Court : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కుల సంఘాలకు కట్టబెట్టడం కరెక్ట్ కాదని, వెంటనే ఆ జీవో కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు.
- Author : Latha Suma
Date : 17-02-2025 - 8:50 IST
Published By : Hashtagu Telugu Desk
High Court : హైకోర్టులో ఈరోజు హైదరాబాద్‌లో కమ్యూనిటీ భవనాలకు భూకేటాయింపులపై విచారణ జరిగింది. బలిజ, కాపు, వెలమ, కమ్మ సంఘాలకు సర్కారు భూములు కేటాయించడాన్ని హైకోర్టులో పిటిషనర్ సవాల్ చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. వీటితోపాటు ఇకపై ఎలాంటి నిర్మాణాలు, చేపట్టరాదని వెలమ, కమ్మ, విశ్వబలిజ కాపు సంఘాలకు ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Srimukhi : శ్రీముఖి హాట్ & స్పైసి లుక్
కాగా, రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్ట్ షాక్ ఇచ్చింది. హైదరాబాద్‌లో కమ్యూనిటీ భవనాలకు భూకేటాయింపులపై హైకోర్టులో విచారణ జరిగింది. బలిజ, కాపు, వెలమ, కమ్మ సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం భుములు కేటాయింపులు జరపడం పట్ల హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కుల సంఘాలకు కట్టబెట్టడం కరెక్ట్ కాదని, వెంటనే ఆ జీవో కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన కోర్టు.. ఆయా భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని సర్కార్ కు నోటీసులు జారీ చేసింది. కాగా ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వ న్యాయవాది కొంత సమయం కోరగా.. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
Read Also: Plotted Development Project : వుడ్స్ ఇంద్రేషమ్‌ను ప్రారంభించిన స్టోన్‌క్రాఫ్ట్ గ్రూప్