Telangana: ఎకరాకు లక్ష: కేసీఆర్ బాగోతం, హైకోర్టు మొట్టికాయలు
తెలంగాణ ప్రభుత్వం దుందుడుకు నిర్ణయాలకు హైకోర్టు మొట్టికాయలు వేస్తూనే ఉంది. పలు మార్లు ప్రభుత్వ తీరును ఎండగట్టిన హైకోర్టు తాజాగా మరోసారి తెలంగాణ గవర్నమెంటుకు నోటీసులు జారీ చేసింది.
- By Praveen Aluthuru Published Date - 03:18 PM, Tue - 29 August 23

Telangana: తెలంగాణ ప్రభుత్వం దుందుడుకు నిర్ణయాలకు హైకోర్టు మొట్టికాయలు వేస్తూనే ఉంది. పలు మార్లు ప్రభుత్వ తీరును ఎండగట్టిన హైకోర్టు తాజాగా మరోసారి తెలంగాణ గవర్నమెంటుకు నోటీసులు జారీ చేసింది.వివరాలలోకి వెళితే..
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో రాజా బహదూర్ వెంకటరామా రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి ఎకరానికి లక్ష చొప్పున ఐదు ఎకరాలు కేటాయించడంపై హైకోర్టు సీరియస్ అయింది. దీంతో కేసీఆర్ ప్రభుత్వానికి నోటీసులు పంపింది.భూకేటాయింపులను ఏవిధంగా సమర్థిస్తారో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
బుద్వేల్‌లోని సర్వే నెం.325/3/2లో ఐదెకరాల భూమిని కేటాయిస్తూ సెప్టెంబర్ 9, 2018న జారీ చేసిన జీఓ 195ను సవాల్ చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త కోటేశ్వరరావు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ అనంతరం ధర్మాసనం నోటీసులు జారీ చేసి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
Also Read: Congress plus Left : కామ్రేడ్లకు మిర్యాలగూడ, హుస్నాబాద్, మునుగోడు?