Red Alert : తెలంగాణలో భారీ వర్షాలు..వాతావరణ శాఖ హెచ్చరిక..!
- Author : Latha Suma
Date : 15-07-2024 - 5:39 IST
Published By : Hashtagu Telugu Desk
Heavy rains: తెలంగాణలో ఉత్తర, ఈశాన్య జిల్లాలో రానున్న ఐదు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు షియర్ జోన్ ఏర్పడిందని ఈ ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈరోజు( సోమవారం) కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్ హన్మకొండ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, జనగాం, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 18, 19 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది.
Read Also: CM Chandrababu: దోచేశారు.. సహజవనరుల దోపిడీపై చంద్రబాబు గరం