Heavy Rain : హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచే భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం
హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచే భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమైయ్యాయి. హైదరాబాద్
- Author : Prasad
Date : 27-07-2023 - 8:21 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచే భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమైయ్యాయి. హైదరాబాద్ నగరానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి మొత్తం ఆరు జోన్‌లలో ఈరోజు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) నివేదిక ప్రకారం జూలై 26 ఉదయం 8:30 నుండి ఈ రోజు ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలలో గణనీయమైన వర్షపాతం నమోదైంది.
నగరంలో అత్యధికంగా బండ్లగూడలో 54.8 మిమీ, గోల్కొండలో 51.3 మిల్లీమీటర్లు, షేక్‌పేటలో 47.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాల వల్ల అనేక ప్రాంతాల్లో.. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. వివిధ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ సమస్యలకు దారితీసింది. నగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల మధ్య హిమాయత్ సాగర్ వరద గేట్లను నిన్న సాయంత్రం 4 గంటలకు ఎత్తివేశారు. మూసీ నదిలోకి నీటిని విడుదల చేసేందుకు అధికారులు మధ్యాహ్నం 2:30 గంటలకు ఉస్మాన్ సాగర్ రెండు గేట్లను కూడా ఎత్తివేశారు. TSDPS నివేదిక ప్రకారం, జూలై 28 వరకు హైదరాబాద్‌లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరారు.