HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Heavy Police Presence Around Telangana Bhavan

KTR : కేటీఆర్ ను అరెస్ట్ చేయబోతున్నారా..? తెలంగాణ భవన్ చుట్టూ భారీగా పోలీసులు

సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) ఆధ్వర్యంలో ఈ విచారణ జరగనుంది. అరెస్టు ప్రణాళిక సిద్ధం చేస్తూ, న్యాయపరమైన అభ్యంతరాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది

  • Author : Sudheer Date : 19-12-2024 - 8:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr Arrest News
Ktr Arrest News

ఫార్ములా ఈ-కారు రేస్ వ్యవహారం (Formula E Car Race Case) తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపింది. ఈ కేసులో కేటీఆర్ పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేయడం సంచలనం సృష్టిస్తుంది. కేటీఆర్‌ను A1, అర్వింద్ కుమార్‌ను A2, బీఎల్ఎన్ రెడ్డిని A3గా ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 13(1A), 13(2), 409, 120 సెక్షన్ల ఆధారంగా కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద దర్యాప్తు చేపడుతున్నట్లు సమాచారం.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయం కేంద్రంగా ఈ కేసును దర్యాప్తు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) ఆధ్వర్యంలో ఈ విచారణ జరగనుంది. అరెస్టు ప్రణాళిక సిద్ధం చేస్తూ, న్యాయపరమైన అభ్యంతరాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. హైప్రొఫైల్ కేసు కావడంతో దర్యాప్తు వివరాలు రహస్యంగా ఉంచినట్లు సంబంధిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం ఉద్రిక్తతలను పెంచింది. కేటీఆర్ అరెస్టు జరిగే అవకాశం ఉందనే వార్తలతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. పోలీసుల భారీ బందోబస్తు కారణంగా ప్రజలు, మీడియా దృష్టి తెలంగాణ భవన్ వైపు మళ్లింది. ఈ కేసు నేపథ్యంలో ఏసీబీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

Read Also : 10th class exam : తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • A1 KTR
  • ACB
  • E car race case
  • Hyderabad Formula E Race Case News
  • ktr
  • KTR Arrest
  • KTR Hyderabad Formula E Race Case

Related News

    Latest News

    • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

    • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

    • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

    Trending News

      • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd