KCR Health Update: మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్.. కాస్త టెన్షన్ పడాల్సిన అంశమిదే!
ఆయన షుగర్ లెవెల్స్ కాస్త పెరిగాయని, సోడియం లెవెల్స్ తగ్గాయని వైద్యులు తెలిపారు. షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో తెచ్చి, సోడియం లెవెల్స్‌ను పెంచుతున్నామని యశోద డాక్టర్ ఏంవీ రావు బులెటిన్‌లో పేర్కొన్నారు.
- Author : Gopichand
Date : 03-07-2025 - 11:05 IST
Published By : Hashtagu Telugu Desk
KCR Health Update: మాజీ సీఎం కేసీఆర్ (KCR Health Update) సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయిన విషయం తెలిసిందే. సీజనల్ ఫీవర్‌తో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. అయితే దీనిపై తాజాగా ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశాయి.
హెల్త్ బులెటిన్ విడుదల
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆరోగ్యం గురించి తాజా సమాచారం ప్రకారం.. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయన సాధారణ వైద్య పరీక్షల కోసం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లారని, ఇది కేవలం రొటీన్ హెల్త్ చెక్-అప్‌లో భాగమని వైద్యులు స్పష్టం చేశారు. అయితే కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని అన్నారు. ఆయన షుగర్ లెవెల్స్ కాస్త పెరిగాయని, సోడియం లెవెల్స్ తగ్గాయని వైద్యులు తెలిపారు. షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో తెచ్చి, సోడియం లెవెల్స్‌ను పెంచుతున్నామని యశోద డాక్టర్ ఏంవీ రావు బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు కాస్త ఆందోళన చెందుతున్నారు.
Also Read: India vs England: ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్!
కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన యశోద ఆసుపత్రి యాజమాన్యం
కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది
ఆయన షుగర్ లెవెల్స్ కాస్త పెరిగాయి. సోడియం లెవెల్స్ తగ్గాయి
షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో తెచ్చి, సోడియం లెవెల్స్‌ను పెంచుతున్నాం – యశోద డాక్టర్ ఏంవీ రావు https://t.co/WNvTWEgQB1 pic.twitter.com/IArxg6mWVU
— Telugu Scribe (@TeluguScribe) July 3, 2025
కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీసిన సీఎం రేవంత్
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. హాస్పిటల్ డాక్టర్లు, అధికారులతో మాట్లాడిన ఆయనకు మంచి చికిత్స అందించాలని కోరారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యం ఉండాలని ఆకాంక్షించారు.
కేసీఆర్ కోలుకోవాలన్న బండి సంజయ్
మాజీ సీఎం KCR ఆరోగ్య పరిస్థితిపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. కేసీఆర్‌కు అత్యున్నత, మెరుగైన చికిత్స అందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. అమ్మవారి ఆశీర్వాదంతో కేసీఆర్ త్వరగా కోలుకొని దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు.