Telangana Budget: అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న హరీశ్ రావు!
రాష్ట్ర బడ్జెట్ (State Budget)ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు (Harish Rao) సోమవారం (ఫిబ్రవరి 6) అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
- By Balu J Published Date - 12:35 PM, Sat - 4 February 23

2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ (State Budget)ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు (Harish Rao) సోమవారం (ఫిబ్రవరి 6) అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ (State Budget), డిమాండ్‌లపై ఫిబ్రవరి 8 నుంచి చర్చలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల తొలిరోజు గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే సభా కార్యక్రమాలపై చర్చించేందుకు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (BAC)సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రకారం శనివారం గవర్నర్ (Governor) ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. ఫిబ్రవరి 6న అంటే సోమవారం బడ్జెట్ ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 5, ఫిబ్రవరి 7 తేదీల్లో సెషన్ ఉండదు.
సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ వినయ్‌భాస్కర్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లు భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క (Batti Vikramarka) మాట్లాడుతూ ప్రజల సమస్యలపై కూలంకుషంగా చర్చించేందుకు మరిన్ని రోజుల పాటు సభను నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఫిబ్రవరి 8న మరోసారి BAC సమావేశమై సెషన్‌ను పొడిగించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ (Speaker) తెలిపారు. ప్రజల సమస్యలను లేవనెత్తేందుకు ప్రతిపక్షాలకు తగిన సమయం ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై 25 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కోరుతూ MIM ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ స్పీకర్‌కు లేఖ రాశారు.
Also Read: Modi@1: మన మోడీ వరల్డ్ నంబర్ 1