HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Harish Rao Demanded For Cancel All Deals With Gautam Adani In Telangana

Gautam Adani : రూ.100 కోట్లు నిధులు వెనక్కి సరే.. 12,400 కోట్ల ఒప్పందాల సంగతేంటి..? – హరీష్ రావు

Gautam Adani : గత నాలుగైదు రోజులుగా అదానీ గ్రూపు వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు

  • Author : Sudheer Date : 25-11-2024 - 6:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BRS Leader Harish Rao
BRS Leader Harish Rao

అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ (Gautam Adani)ఫై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ‘యంగ్ ఇండియా’ స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ గ్రూపు ఇస్తానన్న రూ. 100 కోట్ల విరాళాన్ని తీసుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. గత నాలుగైదు రోజులుగా అదానీ గ్రూపు వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.

కొంతమంది కుట్రపూరిత దురుద్దేశంతో అదానీ గ్రూపునకు తెలంగాణ ప్రభుత్వంతో లింకులు పెడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. ‘‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) పాలసీ కింద యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి రూ. 100 కోట్ల విరాళాన్ని ఇస్తామని అదానీ గ్రూపు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మేం ఆ డబ్బులు తీసుకోవటానికి రెడీగా లేం. ఈవిషయాన్ని మేం లేఖ ద్వారా అదానీ గ్రూపునకు తెలియజేశాం’’ అని సీఎం రేవంత్ తెలిపారు. కాగా సీఎం తీసుకున్న ఈ నిర్ణయం పై మాజీ మంత్రి , బిఆర్ఎస్ నేత హరీష్ రావు స్పందించారు.

స్కిల్‌ యూనివర్సిటీకి ఇచ్చిన 100 కోట్లు నిధులు వెనక్కి తీసుకున్నారు సరే.. అదానీ అవినీతిపై రాహుల్ గాంధీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్న సమయంలో దావోస్‌లో మీరు అదానీతో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల సంగతేంటని ప్రశ్నించారు. అదానీకి రాష్ట్రంలోని డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు మీరు చేస్తున్న కుట్రల మాటేమిటి..? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అవినీతి పరుడు అన్న వ్యక్తికే గల్లీ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచిందని , ఢిల్లీలో రాహుల్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆదానీతో రేవంత్ రెడ్డి దోస్తీ చేసి ఒప్పందాలు చేసుకున్నాడని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇప్పుడు అదానీతో అవినీతి బయటికిరాగానే మాట మార్చేశారని , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాల‌న్నింటినీ ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు.

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన 100 కోట్ల నిధులను వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారూ…

మరి, రాహుల్ గాంధీ గారు అదాని అవినీతి మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్న సమయంలో దావోస్ లో మీరు ఆదానితో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల… pic.twitter.com/XuxVIF7IgM

— Harish Rao Thanneeru (@BRSHarish) November 25, 2024

Read Also : Maharashtra : ముఖ్యమంత్రి అంశంపై స్పందించిన అజిత్‌ పవార్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gautam adani
  • harish rao
  • revanth reddy
  • telangana

Related News

Twins Same Marks in Intermediate Results 2026

ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

ఏపీలో ఇంటర్‌ ఫలితాల్లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. రెండు చోట్ల కవలలు ఒకేలా మార్కులు సాధించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన చాందిని, చర్మిల అనే కవలలు 470 మార్కులకు గాను ఇద్దరూ 459 చొప్పున మార్కులు సాధించారు. శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేట మండలం కోవిలానికి చెందిన కవలలు భరత్‌ చరణ్‌, భవ్యశ్రీ 470 మార్కులకు 447 మార్కులు సాధించారు. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో కవలలు ఒకేలా మార్కులు సాధించి ఔ

  • Kalvakuntla Kavitha Warning

    Kalvakuntla Kavitha: తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం: కల్వకుంట్ల కవిత

  • Biogas

    Bio-Gas Project : సిద్దిపేటలో బయో-గ్యాస్ ప్రాజెక్ట్ ప్రారంభం

Latest News

  • Booms Bet Casino registratie: stappenplan voor een snelle start

  • IPL 2026 : కోల్‌కతా నైట్ రైడర్స్ కు ఐదో ఓటమి.. గుజరాత్ కు హ్యాట్రిక్ విజయం

  • Abhishek Sharma : బల్కంపేట్ ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్..అమ్మ నీ దయ !!

  • Delimitation Bill : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం అంటూ సీఎం రేవంత్ హర్షం

  • Delimitation Bill : ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయం అంటూ ప్రియాంకా గాంధీ సంబరాలు

Trending News

    • కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

    • లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

    • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

    • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd