Gudem Mahipal Reddy : ఈడీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో మహిపాల్‌రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు
- By Sudheer Published Date - 03:48 PM, Tue - 2 July 24

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy)ని ఈరోజు ఈడీ (ED) అధికారులు ముందు హాజరయ్యారు. ఇటీవల మహిపాల్‌రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 2 రోజుల పాటు ఆయన నివాసంలో బంధువుల ఇళ్లలో సోదాలు జరుపగా..మొత్తం రూ.300 కోట్ల అవినీతి జరిగిందని సోదాల్లో గుర్తించారు. మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ కేసు నమోదు చేసింది. రూ.39కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో జులై 02 న ఈడీ విచారణ కు హాజరు కావాలని నోటీసులు జారీ చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో నేడు బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో మహిపాల్‌రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. స్టేట్‌మెంట్ రికార్డ్ అనంతరం ఈడీ కార్యాలయం నుంచి ఆయన వెళ్లిపోయారు. మళ్లీ విచారణకు పిలిస్తే వస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులకు తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం బిఆర్ఎస్ నేతలను పలు కేసులు వెంటాడుతున్నాయి. మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితను ఈడీ, సీబీఐ అరెస్ట్ చేసి 108 రోజులు దాటింది. ప్రస్తుతం ఈమె తీహార్ జైలులో ఉన్నారు. మరోవైపు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కేసీఆర్ పై పలు ఆరోపణలు వస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లతో పాటు యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డి ఛైర్మన్‌గా విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఇలా వరుసగా బిఆర్ఎస్ నేతలపై ఈడీ నోటీసులు జారీ చేస్తుండడంతో ఎప్పుడు ఎవర్ని అరెస్ట్ చేస్తారో అనే భయం పార్టీ శ్రేణుల్లో నెలకొంది.
Read Also : China Badminton Player : బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో చైనా ఆటగాడు మృతి..