HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Green Signal For Transfers Of Tehsildars

Tehsildars Transfers: త‌హ‌శీల్దార్ల బ‌దిలీల‌కు గ్రీన్ సిగ్న‌ల్‌

ఇటీవ‌ల రెవెన్యూ మంత్రితో జ‌రిగిన ముఖాముఖి స‌మ‌యంలోనూ ఇదే విష‌యాన్ని టీజీటీఏ బ‌లంగా చెప్ప‌డం జ‌రిగింది. ఎట్ట‌కేల‌కు బ‌దిలీల‌కు సంబంధించిన ఐచ్ఛికాల‌ను ఇచ్చుకోవాల్సిందిగా త‌హ‌శీల్దార్ల‌కు అవ‌కాశం ఇస్తూ ఈమేర‌కు సీసీఎల్ఏ ఆదేశాల‌ను జారీ చేశారు.

  • Author : Gopi Date : 10-10-2024 - 6:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister Ponguleti
Minister Ponguleti

Tehsildars Transfers: త‌హ‌శీల్దార్ల ఎన్నిక‌ల బ‌దిలీల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో బ‌దిలీ అయిన త‌హ‌శీల్దార్లు సొంత జిల్లాల‌కు తిరిగిపోయే (Tehsildars Transfers) విధంగా అవ‌కాశం క‌ల్పిచాల‌ని తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్ (టీజీటీఏ) మొద‌టి నుంచి చేస్తున్న కృషి ఫ‌లించింది. ఇప్ప‌టికే ఇదే విష‌య‌మై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డికి, సీసీఎల్ఏ న‌వీన్ మిట్ట‌ల్ ని ప‌లు మార్లు టీజీటీఏ నేత‌లు క‌లిసి ఎన్నిక‌ల బ‌దిలీల‌పై విన‌తిప‌త్రాల‌ను ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల రెవెన్యూ మంత్రితో జ‌రిగిన ముఖాముఖి స‌మ‌యంలోనూ ఇదే విష‌యాన్ని టీజీటీఏ బ‌లంగా చెప్ప‌డం జ‌రిగింది. ఎట్ట‌కేల‌కు బ‌దిలీల‌కు సంబంధించిన ఐచ్ఛికాల‌ను ఇచ్చుకోవాల్సిందిగా త‌హ‌శీల్దార్ల‌కు అవ‌కాశం ఇస్తూ ఈమేర‌కు సీసీఎల్ఏ ఆదేశాల‌ను జారీ చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యం ప‌ట్ల టీజీటీఏ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎస్‌.రాములు, మహిళా అధ్యక్షురాలు పి. రాధ, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌మేష్ పాక‌, సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ పూల్‌సింగ్ చౌహాన్ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ‌నివాస్‌రెడ్డికి మరియు నవీన్ మిట్టల్ కి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Also Read: Varun Tej Matka : మట్కా కోసం పూర్ణా మార్కెట్ సెట్.. మేకింగ్ వీడియో..!

అంద‌రికీ అవ‌కాశం క‌ల్పించేందుకు కృషి: టీజీటీఏ

అర్హ‌త‌, ఆసక్తి, అవ‌కాశం ఉన్న ప్ర‌తి త‌హ‌శీల్దార్‌కు బ‌దిలీకి అవ‌కాశం క‌ల్పించాల‌ని టీజీటీఏ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎస్‌.రాములు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌మేష్ పాక‌, సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ పూల్‌సింగ్ చౌహాన్ కోరారు. ఎన్నిక‌ల బ‌దిలీల విష‌యంలో ఇప్ప‌టికే కొంత జాప్యం జ‌రిగింద‌న్నారు. ఎలాంటి ష‌ర‌తులు లేకుండా ఎన్నిక‌ల స‌మ‌యంలో బ‌దిలీ అయిన ప్ర‌తి త‌హ‌శీల్దార్‌కు సొంత జిల్లాల‌కు వెళ్లె విధంగా అవ‌కాశం క‌ల్పించాల‌న్నారు. ప్ర‌తి ఒక త‌హ‌శీల్దార్‌కు బ‌దిలీ అవ‌కాశం క‌ల్పించేందుకు టీజీటీఏ కృషి చేస్తుంద‌న్నారు. ఎవ‌రూ కూడా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

Also Read: One Nation One Election : ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ మాకొద్దు.. కేరళ అసెంబ్లీ సంచలన తీర్మానం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Government Of Telangana
  • Minister Ponguleti Srinivasa Reddy
  • Navin Mittal
  • Revenue Offciers
  • Tehsildars Transfers
  • telangana
  • Transfers

Related News

MIssing Case

Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

ఫిన్లాండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి 45 రోజులుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుమారుడి ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హయత్‌నగర్‌కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి, ఫిన్లాండ్‌లోని లాహ్తిలో ఉన్న LUT యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మే 5న తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన తర

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Another scion enters Telangana politics... Will Ponguleti Srinivasa Reddy's son-in-law contest the Assembly election?

    Arjun Reddy: తెలంగాణ రాజకీయాల్లోకి మరో వారసుడు.. అసెంబ్లీ బరిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అల్లుడు..?

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd