CM Revanth : హైదరాబాద్లో రూ.6,679కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్
CM Revanth : జీహెచ్ఎంసీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (HCITI) పేరుతో చేపట్టనున్న
- By Sudheer Published Date - 07:12 PM, Thu - 26 June 25

హైదరాబాద్ నగర అభివృద్ధిలో మరో కీలక మైలురాయిగా రూ.6,679 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth ) ఆమోదం తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (HCITI) పేరుతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులను రెండు దశల్లో అమలు చేయాలని నిర్ణయించారు.
CM Chandrababu : గంజాయి బ్యాచ్‌కు సహకరించిన వారికి గుణపాఠం : సీఎం చంద్రబాబు
ఈ ప్రాజెక్టుల అమలుతో నగరంలోని రోడ్లు, డ్రైనేజీ, వర్షపు కాల్వలు, ట్రాఫిక్ నియంత్రణ, వంతెనలు, ఫుట్‌పాత్‌లు, పార్కింగ్ ఏర్పాట్ల వంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాల్లో గణనీయమైన అభివృద్ధి జరగనుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వచ్చే నెలాఖరులోగా ఈ పనులను ప్రారంభించి, వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు సౌకర్యంగా ఉండేలా ఆధునిక సాంకేతికతతో పనులను చేపట్టాలని స్పష్టంగా సూచించారు.
ఈ ప్రాజెక్టుల వల్ల హైదరాబాద్ నగరం స్మార్ట్ సిటీ లక్ష్యాలను చేరుకోవడంలో ముందడుగు వేస్తుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా, ప్రతి పౌరుడికి జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజా అవసరాలను పరిగణలోకి తీసుకుని సుదీర్ఘకాలిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని ఈ మౌలిక వసతుల ప్రణాళిక రూపొందించబడిందని అధికారులు తెలిపారు.