Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”
- Author : Vamsi Chowdary Korata
Date : 09-07-2026 - 5:43 IST
Published By : Hashtagu Telugu Desk
“తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా” అని ముద్దుల మనవడు అడిగితే తాత ఎలా కాదనగలరు?
ఎంత బిజీ రాజకీయ, ప్రజా జీవితంలో ఉన్నప్పటికీ.. మనవడి కోరిక మేరకు కిచెన్‌లోకి అడుగుపెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పక్కనే మనవడు రుద్రదేవ్, దోసిట్లో నవ్వులు చిందిస్తూ.. నిరంతరం ప్రజా సేవ, అధికారిక సమీక్షలతో బిజీగా గడిపే సీఎం.. తన మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, అత్యంత మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.
“తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా” అని మనవడు అడిగితే తప్పుతుందా?
పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు…
బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు..#Family pic.twitter.com/TXDbufWCdY
— Revanth Reddy (@revanth_anumula) July 9, 2026