Governor Tamilisai Speech in Assembly : గవర్నర్ తమిళసై ప్రసంగం ఫై ఉత్కంఠ..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మరికాసేపట్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) ప్రసంగించనున్నారు.
- Author : Sudheer
Date : 15-12-2023 - 11:40 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly Session) భాగంగా మరికాసేపట్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan ) ప్రసంగించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గవర్నర్ మాట్లాడడం ఇదే మొదటిసారి. దీంతో ఆమె ఏం మాట్లాడతారో అనేది ఆసక్తిగా మారింది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండ హామీలు నెరవేరుస్తామని తెలిపారు. ఇక ఇప్పుడు కాగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ప్రకటించిన హామీల ఫై గవర్నర్ ఏమంటారో ..ముఖ్యంగా రూ.4వేల పెన్షన్, రైతుల రూ.2 లక్షల రుణమాఫీ, ప్రతి మహిళకు నెలకు రూ.2500 నగదు బదిలీ, రూ.500కు గ్యాస్ సిలిండర్ వంటి వాటిపై గవర్నర్ ఏమంటారో అనేది ఉత్కంఠగా మారింది.
We’re now on WhatsApp. Click to Join.
ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ (Telangana Assembly) సభ ప్రారంభం అవుతుంది. దీని వెంటనే గవర్నర్ తమిళిసై (Tamilisai) ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదా పడనుంది. ఇక గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. దీనిలో సభ ఎన్ని రోజులు నడపాలనే దాని మీద నిర్ణయం తీసుకోనున్నారు. ఇక రేపటి నుంచి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చ జరుగుతుంది. మరోవైపు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగనున్న ఈ మొదటి చర్చలోనే ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మధ్య మాటల వార్ నడిచే ఛాన్స్ ఉందని అంటున్నారు. తొలి క్యాబినెట్‌లోనే తీసుకుంటామని చెప్పిన నిర్ణయాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ పార్టీ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.
Read Also : Naa Saami Ranga: నా సామిరంగ నుంచి అల్లరి నరేష్ గ్లింప్స్, అంజిగాడ్ని ఎంట్రీ అదుర్స్