Tamilisai Soundararajan : సఫిల్ గూడ అత్యాచార ఘటనపై గవర్నర్ సీరియస్…కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కార్ కు ఆదేశం..!!
DAVస్కూల్ అత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
- Author : hashtagu
Date : 20-10-2022 - 7:38 IST
Published By : Hashtagu Telugu Desk
DAVస్కూల్ అత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై గవర్నర్ తమిళసై సీరియస్ అయ్యారు. బాలికపై స్కూల్ ప్రిన్సిపాల్ డ్రైవర్ వేధింపులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదిక సమర్పించాలంటూ తెలంగాణ సర్కార్ ను ఆదేశించారు.
బంజారాహిల్స్ లోని డీఏవీ స్కూల్లో ఎల్ కేజీ చదువుతున్న చిన్నారిపై అదే పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రిన్సిపాల్ గదికి పక్కనే ఈ దారుణం జరిగినా ప్రిన్సిపాల్ పట్టించుకోకపోడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన డ్రైవర్ ను చితకబాది పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రజనీకుమార్ తోపాటు ప్రిన్సిపాల్ పై ఫోక్సో చట్టం కిద్ద కేుస నమోదు చేసి అరెస్టు చేశారు. వీరిద్దరికీ 14రోజుల రిమాండ్ విధంచింది మెజిస్ట్రేట్.