Salary Hike : ఆర్టీసీ ఉద్యోగులకు భారీగా జీతాల పెంపు
Salary Hike : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.
- By Pasha Published Date - 02:55 PM, Sat - 9 March 24

Salary Hike : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. వారికి ఇక జీతాలు పెరగనున్నాయి. 21 శాతం ఫిట్‌మెంట్ ఇస్తామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. జూన్ 1 నుంచి కొత్త ఫిట్‌మెంట్(Salary Hike) అమలులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. కొత్త ఫిట్‌మెంట్ వల్ల 53,071 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో తెలంగాణ ఆర్టీసీపై నెలకు రూ.35 కోట్ల భారం పడుతుందని చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join
2017 సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఆర్టీసీ ఉద్యోగులకు 16శాతం పీఆర్సీ ఇచ్చింది. అప్పటి నుంచి మళ్లీ పీఆర్సీ ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించినట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ ఇస్తామని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశామని గుర్తు చేశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ..మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం పథకాన్ని కొనసాగిస్తామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
Also Read : Dry Ice : ‘డ్రై ఐస్’ దడ.. అది అంత డేంజరా ?
శవాల మీద పేలాలు ఏరుకునేలా..
‘‘పేద ప్రజల ప్రయాణ సాధనం ఆర్టీసీ. ఆర్డినరీ బస్సులకు ఎక్స్‌ప్రెస్ బస్సుల కలర్స్ వేసి నడపుతున్నామని అనడం వాస్తవం కాదు. ఆటో కార్మికులకు కొంత అన్యాయం జరిగింది. వారిని ఆదుకుంటాం. శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా మాజీ మంత్రులు ప్రవర్తిస్తున్నారు. గత ప్రభుత్వంలోని మంత్రులు.. ఆటో కార్మికులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.. అలాంటి వాళ్లు మా ముందు పెద్దపెద్ద డిమాండ్లు పెడుతున్నారు. ఆటో కార్మికులకు 15000 ఇవ్వాలని అడుగుతున్నారు’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేశారు.