Gold Price Today : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?
Gold Price Today : బంగారం కొనాలనుకునే వారికి అలర్ట్. వరుసగా భారీగా పెరుగుకుంటూ వచ్చిన గోల్డ్ రేట్లు ఇవాళ మాత్రం స్వల్పంగా తగ్గాయి. దేశీయంగా స్వల్పంగా పడిపోగా.. ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం భారీగా పడిపోయింది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో, అదే విధంగా దేశీయంగా పసిడి ధరలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.
- By Kavya Krishna Published Date - 09:14 AM, Tue - 28 January 25

Gold Price Today : భారతీయులు, ముఖ్యంగా మహిళలు, బంగారం కొనుగోలు చేయడంలో ఎంతో ఆసక్తి చూపిస్తారు. పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయంలో గోల్డ్ జువెలరీ కొనుగోలు చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఈ సందర్భాల్లో గోల్డ్ డిమాండ్ పెరగడంతో ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. గతంలో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడం, ప్రస్తుతం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కొన్ని కఠిన నిర్ణయాల కారణంగా పసిడి ధరలు మరింత పెరిగాయి. జనవరి 24న బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని చేరుకున్నాయి. అయితే ఇవాళ స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
Delhi Elections : ఆకట్టుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మ్యానిఫెస్టో
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గడంతో తులం రూ. 75,400 వద్దకు చేరింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 170 తగ్గడంతో 10 గ్రాములకు రూ. 82,250 వద్ద ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గడంతో తులం రూ. 75,550 వద్ద ట్రేడవుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 170 తగ్గడంతో ఇది 10 గ్రాములకు రూ. 82,400 వద్ద ఉంది.
బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా తగ్గాయి. ఢిల్లీలో వెండి ధర రూ. 1,000 తగ్గడంతో కేజీ రూ. 96,500 కు చేరింది. ఇదే సమయంలో హైదరాబాద్‌లో వెండి ధర కూడా రూ. 1,000 తగ్గి కేజీ రూ. 1.04 లక్షలకు పడిపోయింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $2,740 వద్ద ట్రేడవుతోంది, ఇది గత రోజు $2,780 వద్ద ఉండేది. స్పాట్ సిల్వర్ ధర ప్రస్తుతం ఔన్సుకు $30.12 వద్ద ఉంది. దేశీయంగా ఈ ప్రభావం ఉదయం 10 గంటల తర్వాత కనిపిస్తోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ప్రస్తుతం ₹86.45 వద్ద స్థిరంగా ఉంది. గోల్డ్, సిల్వర్ రేట్లు ప్రాంతాల వారీగా మారుతుండటంతో స్థానిక ధరలు , ఇతర అంశాలు ఈ మార్పుల్లో ప్రభావం చూపుతాయి.
Rythu Bharosa : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ సర్కార్