Gold Price Today : తగ్గిన బంగారం ధర.. నేటి ధరలు ఇవే..!
Gold Price Today : బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. ఎట్టకేలకు దాదాపు ఐదు రోజుల తర్వాత బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పసిడి కొనుగోలుదారులకు ఊరటగా చెప్పవచ్చు. అయితే, మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో జనవరి 19వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో బంగారం రేటు ఎంత తగ్గింది? ప్రస్తుతం తులం రేటు ఎంత పలుకుతోంది? అనేది ఇప్పుడే తెలుసుకుందాం.
- By Kavya Krishna Published Date - 09:39 AM, Sun - 19 January 25

Gold Price Today : భారతీయులకు బంగారం అంటే ప్రత్యేక ఆకర్షణ. మహిళలు ఆభరణాలుగా బంగారాన్ని ధరించడం మాత్రమే కాదు, పండగలు, శుభకార్యాల్లో కూడా బంగారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇటీవలి కాలంలో బంగారం పెట్టుబడి సాధనంగా మారిపోవడంతో, దానిపై డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. దేశానికి ప్రతి సంవత్సరం టన్నుల కొద్దీ పసిడి దిగుమతి అవుతుంది. ప్రత్యేక సందర్భాల్లో బంగారం కొనుగోళ్ల డిమాండ్ మరింతగా ఉంటుంది.
ఈ కొత్త సంవత్సరంలో (2025) ప్రారంభం నుండి బంగారం ధరలు భారీగా పెరుగుతూ భయపెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణం. అయితే, ఐదు రోజుల పాటు స్థిరంగా ఉన్న తర్వాత, ఇటీవల దేశీయ మార్కెట్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం రేట్లు గరిష్ఠ స్థాయిలో కొనసాగుతున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ప్రస్తుతం ఔన్సుకు 2702 డాలర్ల పైన ఉంది. స్పాట్ సిల్వర్ రేటు 30.38 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు, భారత రూపాయి విలువ దిగజారుతూ రికార్డ్ కనిష్ఠ స్థాయిలో ₹86.653 వద్ద ఉంది.
Sri Reddy: వైసీపీ అభిమాని అయినందుకు సిగ్గుపడుతున్నా.. శ్రీరెడ్డి సంచలనం
హైదరాబాద్ మార్కెట్లో ధరలు
బంగారం ధరలు తగ్గుదల:
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఐదు రోజుల తర్వాత స్వల్పంగా తగ్గాయి.
22 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధర ₹150 తగ్గి ₹74,350.
24 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధర ₹160 తగ్గి ₹81,110.
వెండి ధరలు:
వెండి రేట్లు గత మూడు రోజులలో కిలోకు ₹5,000 పెరిగాయి. కానీ ప్రస్తుతం స్థిరంగా ₹1,04,000 వద్ద కొనసాగుతున్నాయి.
(గమనిక : ఈ ధరలు ఆదివారం ఉదయం 7 గంటల సమయానికి సంబంధించినవి. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు తాజా రేట్లు చెక్ చేసుకోవడం ఉత్తమం. ట్యాక్సులు, ఇతర ఛార్జీలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.)
NTR Ghat : ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణ లోపంపై లోకేశ్ అసంతృప్తి..సొంత నిధులు కేటాయింపు