HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Girls Should Be Brought Safely From Ukraine War

Ukraine Live: బంకర్లలో బిక్కు బిక్కుమంటూ..!

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఉక్రెయిన్ కంట్రీలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. అయితే గత నాలుగు రోజులుగా యుద్ధం తీవ్రస్థాయికి చేరుకోవడంతో అక్కడే చిక్కుకుపోయిన

  • Author : Balu J Date : 28-02-2022 - 3:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ukrain
Ukrain

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ కంట్రీలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. అయితే గత నాలుగు రోజులుగా యుద్ధం తీవ్రస్థాయికి చేరుకోవడంతో అక్కడే చిక్కుకుపోయిన విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. తినడానికి తిండి లేక.. బ్యాంకుల్లో డబ్బులున్నా చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని కొత్తపేట తేజస్వినీ ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. యుద్ధం కారణంగా ఆ దేశంలో చిక్కుకుపోయింది. తాను పడుతున్న ఇబ్బందులు గురించి తన తండ్రి వేణుకు వివరించారు. ఈ సందర్భంగా తన బిడ్డ వేదనను మీడియాకు వెల్లడించారు తండ్రి వేణు.. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..

మా పాప ఉన్నత చదువుల కోసం ఉక్రెయిన్ వెళ్లింది. అయితే రెండు దేశాల మధ్య యుద్ధం ఉంటుందని తెలిసినా అక్కడి యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. కర్ఫ్యూ కారణంగా సరుకులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఉంది. బంకర్లలో ఉంచడంతో బ్రితీంగ్ ఇష్యూ కూడా వేధిస్తుంది. పిల్లలు నిత్యం ఇబ్బందులు పడటంతో మా లాంటి తల్లిదండ్రులు పస్తులు ఉండాల్సిన పరిస్థితులున్నాయి. కొన్ని ఎయిర్ పోర్ట్ ల్లో బాంబ్ బ్లాస్ట్ కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రోజురోజుకూ యుద్ధం తగ్గిపోతుందని భావించాం.. కానీ తీవ్రత పెరుగుతూ వస్తోంది. అందుకే పిల్లలు భయాందోళనకు గురవుతున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన తీసుకురావాలి. పిల్లలు రోడ్డుమార్గం ద్వారా వెళ్లాలనుకున్నా.. అవన్నీ దెబ్బతిన్నాయి. యుద్ధం కారణంగా సమీప దేశాలకు కూడా వెళ్లలేని పరిస్థితి. మెడిసిన్ చదువాలంటే మన దేశంలో చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే మా బిడ్డను ఉక్రెయిన్ ను పంపించాం. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని నాలాంటి ఎవ్వరూ ఊహించలేదు.  ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ నేతలకు ట్విట్ చేశా. వాళ్లంతా సానుకూలంగా స్పందించారు. త్వరితగతిన పిల్లలను తీసుకువస్తే చాలా సంతోషిస్తాం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • father request
  • hyderabad
  • Russia-Ukraine War
  • students

Related News

Phone Recharge suicide Live-in relationship Jeedimetla hyderabad

Hyderabad Crime: ప్రియుడు ఫోన్ రీఛార్జ్ విషయంలో గొడవ..

ప్రియుడు మొబైల్ ఫోన్‌కు రీచార్జ్ చేయించలేదన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… కుత్బుల్లాపూర్ ప్రశాంత్ నగర్‌లో కిరణ్మయి అనే యువతి నివాసం ఉంటోంది. గతంలో ఆమెకు వివాహమై విడాకులు తీసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉండగా, అతను కిరణ్మయి తల్లి వద్ద పెరుగుతున్నాడు. ఈ క్రమంలో ఓ ప్రైవేటు సంస్థలో పని

  • Telangana Government Announces 2BHK Homes for HYDRA Victims

    HYDRA: హైడ్రా బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

  • CM Chandrababu Naidu to Visit Pawan Kalyans Residence

    పవన్ ఇంటికి సీఎం చంద్రబాబు

  • Srh Klassen

    IPL 2026 : SRH ఫ్యాన్స్ కు క్లాసెన్ దేవుడయ్యాడు !!

  • Brs25years

    BRS @ 25 Years : ఉద్యమ పునాది.. ప్రగతి ప్రస్థానం – పాతికేళ్ల ‘గులాబీ’ జైత్రయాత్ర!

Latest News

  • Biryani : వామ్మో ఇక హైదరాబాద్ లో బిర్యానీ తినలేం ! ఆ రేంజ్ లో పెరిగిన ధరలు !!

  • ChandraBose : రచయిత చంద్రబోస్ ఇంట విషాదం..

  • Karimnagar Robbery : పట్టపగలు కరీంనగర్‌లోని జ్యువెలరీ షాపులో కాల్పులు..!

  • Bandla Ganesh : చంద్రబాబు సమక్షంలో బండ్ల గణేష్ కూతురి నిశ్చితార్థ వేడుక

  • Kerala Result : కేరళంలో సంబరాలకు UDF, బీజేపీ ఏర్పాట్లు ..మరి ఏంజరుగుతుందో ?

Trending News

    • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd