GHMC Swimming Pools: ఇంకా తెరుచుకోని జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ ఫూల్స్
- Author : HashtagU Desk
Date : 06-04-2022 - 8:50 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్: నగరంలో రోజురోజుకూ ఎండలు ఎక్కువ అవుతున్నాయి. అయితే ఎండ తీవ్రతను తట్టుకునేందుకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) స్విమ్మింగ్ పూల్స్ జంట నగరాల పౌరులకు జీవనాధారంగా ఉండేవి. అయితే, ఇతర క్రీడా కార్యకలాపాలు కరోనా ఉధృతి తగ్గిన తరువాత తిరిగి ప్రారంభమైనప్పటికీ GHMC స్విమ్మింగ్ పూల్స్ మాత్రం ఇంకా తెరుచుకోలేదు. కోవిడ్ విజృంభణతో రెండేళ్ల క్రితం నగరంలోని స్మిమ్మింగ్ ఫూల్స్ మూతపడ్డాయి.
స్విమ్మింగ్ పూల్స్ తెరిచేందుకు సంబంధిత అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చామని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు వెల్లడించారు. తాము గత నెలలోనే స్మిమ్మింగ్ ఫూల్స్ ని వెంటనే అమలులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసామని.. అయితే, సంబంధిత అధికారులు కొలనులను పరిశీలించి, తెరవడానికి ముందు వాటికి మరమ్మతులు అవసరమా లేదా అని చూస్తారని తెలిపారు. కొన్ని స్మిమ్మింగ్‌ఫూల్స్‌కి మరమ్మత్తులు చేయాల్సి ఉండగా పనులు కొనసాగుతున్నాయని.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 14 కొలనులు ఉండగా కొన్నింటిని ఇప్పటికే ప్రారంభించారని తెలిపారు. అయితే మరమ్మత్తు పనుల కారణంగా ఇంకా కొన్ని తెరవలేదని. అని జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ అదనపు కమిషనర్ విజయలక్ష్మి తెలిపారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని సికింద్రాబాద్, అమీర్‌పేట్, అంబర్‌పేట్, సనత్ నగర్, విజయనగర్ కాలనీ, మొఘల్‌పురా, చందూలాల్ బారాదరిలో ఏడు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. త్వరలో మరికొన్ని పౌరసరఫరాల శాఖ ఆధీనంలోకి రానున్నాయి. ఈ కొలనులు ఇంకా పని చేయకపోవటంతో, అనేక ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్‌లు తమ అవకాశాలను దోచుకుంటున్నాయి.జీహెచ్‌ఎంసీ పూల్స్‌ను ఇంకా ప్రారంభించకపోవడం పట్ల కొంతమంది శిక్షణార్థులు నిరుత్సాహానికి గురవుతున్నారు.
సికింద్రాబాద్‌లోని స్విమ్మింగ్ పూల్ మహమ్మారికి ముందు ఒక సాధారణ రోజులో సుమారు 700 నుండి 800 ఈతగాళ్లకు ఆతిథ్యం ఇచ్చేది. కానీ ఇది ఇప్పటికీ తెరుచుకోలేదు. గత నెలలో కొలనులను తెరవడానికి మాకు సూచనలు వచ్చాయని.. అయితే కొన్నిచోట్ల మరమ్మతు పనులు జరుగుతున్నాయని సికింద్రాబాద్ జోన్ స్పోర్ట్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహమ్మారి కారణంగా ఇది రెండేళ్ల క్రితం మూసివేసి ఉంది కాబట్టి క్లిన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెలాఖరులో వేసవి శిబిరాలు ప్రారంభమయ్యే కంటే ముందే సిద్ధం చేస్తామన్నారు.