Ayodhya – Hyderabad : మేడిన్ హైదరాబాద్.. అయోధ్య రామమందిరం తలుపుల తయారీ ఇక్కడే
Ayodhya - Hyderabad : అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అత్యుత్తమ నాణ్యత కలిగిన మెటీరియల్, ఫర్నీచర్, సామగ్రిని సేకరించారు.
- By Pasha Published Date - 10:04 AM, Tue - 26 December 23

Ayodhya – Hyderabad : అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అత్యుత్తమ నాణ్యత కలిగిన మెటీరియల్, ఫర్నీచర్, సామగ్రిని సేకరించారు. వెరీవెరీ స్పెషల్ ఏమిటంటే.. రామమందిరం తలుపులు మన హైదరాబాద్‌లో తయారయ్యాయి. హైదరాబాద్ న్యూ బోయినపల్లిలోని అనూరాధ టింబర్ డిపోలో ఈ తలుపులను తయారు చేయించారు. గత ఏడాది జూన్ నుంచే హైదరాబాద్‌లో తలుపుల తయారీ పనులు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇక్కడే ఉండి తమిళనాడుకు చెందిన కుమారస్వామితో పాటు దాదాపు అరవై మంది కళాకారులు ఈ తలుపులను(Ayodhya – Hyderabad) తయారు చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అయోధ్య రామమందిరం తలుపుల తయారీకి బల్లార్షా టేకును ఉపయోగిస్తున్నామని అనురాధ టింబర్ డిపో యజమాని చదలవాడ శరత్ బాబు చెప్పారు. ఈ అవకాశం తమకు దక్కడం గొప్ప అదృష్టమని తెలిపారు. శిల్పాకళా నైపుణ్యం కలిగిన అనేక మంది కళాకారులు ఈ తలుపుల తయారీలో పాల్గొంటున్నారని వివరించారు. ఈ తలుపులను చూసి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ కూడా ప్రశంసించారని ఆయన వివరించారు. అయోధ్య రామమందిరం తలుపులను తయారు చేసే అవకాశాన్ని తాము టెండర్ ద్వారా పొందామని చదలవాడ శరత్ బాబు వెల్లడించారు. అయోధ్యలోని రామమందిరం కోసం, ఆలయ ప్రాంగణానికి అవసరమైన 100కుపైగా తలుపులను తాము తయారు చేస్తున్నామన్నారు. 100 కలప ముక్కల్లో సగటున అధిక నాణ్యత కలిగిన 20 కలప ముక్కలను మాత్రమే ఎంచుకొని తలుపుల తయారీ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Also Read: Houthis Warning : ప్రపంచం ఇంటర్నెట్ ఆపేస్తాం.. హౌతీల వార్నింగ్
జనవరి 22న మధ్యాహ్నం 12:30 గంటలకు అయోధ్య రామమందిరాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఆ సమయంలోని 84 సెకన్ల పాటు శుభగడియలు ఉన్నాయని అంటున్నారు.ఎంత పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినా 2,500 ఏళ్లు తట్టుకుని నిలబడేలా ఆలయాన్ని నిర్మిస్తున్నారు.