Ganesh : హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన మహాగణపతి శోభాయాత్ర
హైదరాబాద్ నగరంలో ప్రతిఏటా అగరంగ వైభవంగా జరిగే గణేష్ శోభాయాత్ర జరుగుతుంది. ఈ ఏడాది కూడా శోభాయాత్రకు
- Author : Prasad
Date : 28-09-2023 - 7:19 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ నగరంలో ప్రతిఏటా అగరంగ వైభవంగా జరిగే గణేష్ శోభాయాత్ర జరుగుతుంది. ఈ ఏడాది కూడా శోభాయాత్రకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈరోజు(గురువారం) ట్యాంక్‌బండ్ వద్ద వేల సంఖ్యలో విగ్రహాల నిమజ్జనం జరగనున్నాయి. ట్యాంక్‌బండ్ పరిసరాలన్నీ కోలాహలంగా సందడిగా మారాయి. 11 రోజుల పాటు పూజలందుకు గణనాథులు నేడు గంగమ్మ ఒడికి చేరనున్నాయి. ఇప్పటికే పలు చిన్న చిన్న విగ్రహాలు నిమజ్జనం పూర్తికాకా.. నగరంలో ఉన్న ప్రధాన విగ్రహాలన్నీ ఈ రోజే నిమజ్జనానికి తరలిరానున్నాయి. ఇటు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కూడా ప్రారంభమైంది. ఖైరతాబాద్ మహాగణపతి ఆలయం నుంచి టెలిఫోన్ భవన్, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్‌బండ్‌కి చేరుకోనుంది. ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 4 వద్ద ప్రత్యేక పూజలు అనంతరం మహాగణపతి నిమజ్జనం జరగనుంది. శోభాయత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాలతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, ఎలక్రికల్, శానిటేషన్ సిబ్బందితో అధికారులు సమన్యయం చేసుకుంటున్నారు. మహాగణపతి నిమజ్జనం తిలకించేందకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ రద్దీని పోలీసులు నియంత్రిస్తున్నారు.ఈ రోజు జీహెచ్‍ఎంసీ పరిధిలో 90 వేలకు పైగా విగ్రహాల నిమజ్జనం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.