Krishna Mohan : కాంగ్రెస్‌కు షాక్..సొంత గూటికి చేరిన గద్వాల ఎమ్మెల్యే
కేటీఆర్‌ను కలిసిన కారు పార్టీలోనే ఉంటానని మాటిచ్చిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.
- By Latha Suma Published Date - 02:08 PM, Tue - 30 July 24

Bandla Krishna Mohan Reddy: కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(Gadwala MLA Bandla Krishna Mohan Reddy) మంగళవారం తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పార్టీలో కొనసాగుతా అని క్లారిటీ ఇచ్చారు. అనంతరం కేటీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. అసెంబ్లీ ప్రాంగణంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చుని సరదాగా మాట్లాడుతూ కనిపించారు. ఓ వైపు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా పార్టీలో చేర్చుకుంటుంగా ఈ ఊహించని పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
ఇప్పుడు రాస్కొండి "బీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్ అబ్బా" అని.
తిరిగి సొంత గూటికి చేరుకున్న గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసి పార్టీలో కొనసాగుతా అని తెలిపిన ఎమ్మెల్యే pic.twitter.com/zEHtrEaY8V
— BRS Party (@BRSparty) July 30, 2024
కాగా, గద్వాల బీఆర్‌ఎస్ నుండి గెలిచిన బండ్ల ఈ నెల మొదట్లో పీసీసీ ఛీప్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిన సంగతి తెలిసిందే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల శాసనసభ నియోజకవర్గం నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే ఇటీవల ఆయన బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి అధికార పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కార్యకర్తలు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లు వెల్లడించారు. అయితే ఆయన పార్టీ మారి నెల రోజులు కాకముందే యూటర్న్ తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని అధికార పార్టీ నేతలు చెబుతున్న తరుణంలో కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే తిరిగి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడం చర్చనీయాంశమైంది.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు బండ్ల సొంతగూడికి చేరడంపై బీఆర్‌ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. ‘ఇప్పుడు రాస్కోండి బీఆర్‌ఎస్ దెబ్బకు కాంగ్రెస్ అబ్బా’ అని తిరిగి సొంత గూటికి చేరుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసి పార్టీలో కొనసాగుతా అని తెలిపిన ఎమ్మెల్యే’ అంటూ బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా వెల్లడించింది.
Read Also: Paris Olympics 2024: భారత్ కు మరో పతాకం