Thaggedele : ‘హైడ్రా’కు ఫుల్ పవర్స్ – రంగనాథ్
Thaggedele : ఇక నుంచి చెరువులతో పాటు పార్కులు, ప్రభుత్వ స్థలాలు, రోడ్లను పరిరక్షిస్తుందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు
- By Sudheer Published Date - 07:15 AM, Thu - 17 October 24

హైడ్రా (Hydraa ) కు ఇప్పటికే పలు అధికారాలు ఇచ్చిన సర్కార్ (Telangana Govt)..ఇప్పుడు మరిన్ని అధికారాలు ఇచ్చి ఎక్కడ తగ్గొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ లోనే కాదు రాష్ట్రంలోనూ అక్రమ కట్టడాలపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్..ముందుగా భాగ్యనగరం (Hyderabad) ఫై దృష్టి సారించారు. చెరువులు , ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన కట్టడాలను తొలగించేందుకు హైడ్రా ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో వందల అక్రమ నిర్మాణాలను కూల్చేసి ఆ స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కాగా కొన్ని విషయాల్లో హైడ్రా కు కోర్ట్ బ్రేక్ పడేలా చేస్తుంది.
ఈ క్రమంలో ఇప్పుడు హైడ్రా కు ఎలాంటి బ్రేక్ లు లేకుండా ప్రభుత్వం మరికొన్ని పుల్ పవర్స్ ఇచ్చి ఎక్కడ తగ్గొద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. హైడ్రాకు విశేష అధికారాలు వచ్చాయని, ఇక నుంచి చెరువులతో పాటు పార్కులు, ప్రభుత్వ స్థలాలు, రోడ్లను పరిరక్షిస్తుందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు నోటీసులివ్వడం, వాటిని తొలగించడం, అనధికార భవనాలను సీజ్ చేయడం వంటి అధికారాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ మేరకు GHMC చట్టంలోని సెక్షన్ 374 (B)ని హైడ్రా అధికారాలుగా చేరుస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వల్ల హైడ్రా మరింత బలపడిందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 27 మున్సిపాలిటీల్లో పురపాలక చట్టం ప్రకారం హైడ్రా నడుచుకుంటుందన్నారు.
Read Also : Baahubali 3 : బాహుబలి-3 రానుందా..? – నిర్మాత హింట్