HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Formula E Car Race Green Co Ace Next Gen Companies To Cbi Enquiry Today

Formula e -car Race : నేడు ఏసీబీ విచారణకు గ్రీన్ కో, ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీలు

ఇందులో సీజన్‌ 9కి ఏస్‌నెక్ట్స్‌జెన్‌ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఏస్‌నెక్ట్స్‌జెన్‌ సంస్థకు మాతృ సంస్థ అయిన గ్రీన్‌కో నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎలక్టోరల్‌ బాండ్స్‌ రూపంలో కొన్ని లావాదేవీలు వచ్చాయని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు.

  • Author : Latha Suma Date : 18-01-2025 - 12:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Formula e-car Race: Green Co, Ace Next Gen companies to CBI enquiry today
Formula e-car Race: Green Co, Ace Next Gen companies to CBI enquiry today

Formula e -car Race : ఫార్ములా-ఈ కారు రేసు కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు ఏసీబీ అధికారుల ఎదుట ఏస్‌నెక్ట్స్‌జెన్, గ్రీన్‌కో ప్రతినిధులు విచారణకు హాజరుకానున్నారు. ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించిన ఒప్పందాలు ఫార్ములా ఈ-ఆపరేషన్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఈఓ), ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ ప్రైవేటు లిమిటెడ్, పట్టణాభివృద్ధిశాఖ మధ్య జరిగాయి. ఇందులో సీజన్‌ 9కి ఏస్‌నెక్ట్స్‌జెన్‌ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఏస్‌నెక్ట్స్‌జెన్‌ సంస్థకు మాతృ సంస్థ అయిన గ్రీన్‌కో నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎలక్టోరల్‌ బాండ్స్‌ రూపంలో కొన్ని లావాదేవీలు వచ్చాయని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ ప్రమోటర్‌గా ఉంటూ 9, 10, 11, 12 సెషన్లకు సంబంధించిన ఫీజును ఎఫ్‌ఈవోకు చెల్లిస్తోంది. వాస్తవానికి ప్రమోటర్‌ పాత్రలో తెరపైకి వచ్చిన ఏస్‌ నెక్ట్స్‌జెన్‌, దీని సిస్టర్‌ కంపెనీ ఏస్‌ రేస్‌కు స్పోర్టింగ్‌లో ఎలాంటి అనుభవం లేదు. ఈ కంపెనీలన్నింటిలో చలమలశెట్టి అనిల్‌కుమార్‌ కీలక హోదాల్లో ఉన్నారు. బ్రిటన్‌కు చెందిన ఎఫ్‌ఈవోతో మాజీ మంత్రి కేటీఆర్‌ తొలి దఫా చర్చలు జరిపిన తర్వాత హఠాత్తుగా ఏస్‌ నెక్ట్స్‌జెన్‌, ఏస్‌ రేస్‌ కంపెనీలను 2022 జూలైలో రిజిస్ట్రేషన్‌ చేయించారు.

కాగా, ఈ ఫార్ములా e-కార్‌ రేస్ కేసులో ఇప్పటికే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తో పాటు హెచ్‌ఎండీఏ పూర్వ కమిషనర్ అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ ఇంజినీర్ ఇన్‌ చీఫ్‌ బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ అధికారులు విచారించారు. దీంతో ఫార్ములా ఈ కేసు దర్యాప్తులో ఏసీబీ వేగం పెంచిందని… పలువురు చుట్టూ ఉచ్చు బిగిసే ఛాన్స్ ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇక, హైదరాబాద్‌ వేదికగా 4 సెషన్లలో ఫార్ములా-ఈ కారు రేసు నిర్వహించడం కోసం పురపాలకశాఖ, ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌ (ఎఫ్‌ఈవో), ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ మధ్య 2022 అక్టోబరు 25న త్రైపాక్షిక ఒప్పందం జరిగింది.

Read Also: Lakshmi Parvathi : నన్ను ఎందుకు వేధిస్తున్నారు.. లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ACB Investigation
  • Ace Next Gen Companies
  • brs party
  • Formula E Car Race
  • Green Co
  • ktr

Related News

Kalvakuntla Kavitha lashes out at KTR.

kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌లోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేదే లేదని, ఆ పార్టీతో జతకట్టేదే లేదని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బాయి బాటలో భాగంగా కొత్తగూడెం పర్యటనకు వెళ్లిన సందర్భంగా

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Delhi High Court deals a blow to Kavitha.

    kalvakuntla kavitha: కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్

  • Mallareddy says goodbye to BRS

    Malla Reddy: బీఆర్ఎస్‌కు మల్లారెడ్డి గుడ్ బై

  • Ktr Visit To Kannepalli Pum

    KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd