Formula E Race : ఫార్ములా ఈ కారు కేసు.. సుప్రీంకోర్టులో ప్రభుత్వం కేవియట్ దాఖలు
ముందుగా అలర్ట్ అయిన రేవంత్ ప్రభుత్వం దూకుడు పెంచింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయవాదులతో కేటీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు.
- By Latha Suma Published Date - 03:09 PM, Tue - 7 January 25

Formula E Race : ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా కేటీఆర్ పిటీషన్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దంటూ ప్రభుత్వం అందులో ప్రస్తావించింది. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముంది. ఈ నేపథ్యంలో ముందుగా అలర్ట్ అయిన రేవంత్ ప్రభుత్వం దూకుడు పెంచింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయవాదులతో కేటీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్షణమైనా ఆయన పిటిషన్ దాఖలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
కాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ కేసు కొట్టేయాలంటూ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఈరోజు ధర్మాసనం కొట్టేసిన విషయం తెలిసిందే. దీంతో కేటీఆర్ సుప్రీం కోర్టులో అప్పీలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సుప్రీం కోర్టుకు వెళ్లి ఈ కేసులో అరెస్టు కాకుండా స్టే తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. దీంతో కేటీఆర్‌కు చెక్ పెట్టేలా రేవంత్ సర్కార్ సుప్రీం కోర్టులో తాజాగా కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఒకవేళ కేటీఆర్ సుప్రీంను ఆశ్రయిస్తే.. తమ వాదనను కూడా వినాలని తెలంగాణ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.
మరోవైపు కేటీఆర్ ఈనెల 6న విచారణకు రావాలని కు తొలుత ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అయితే ఆఫీసు వరకు వచ్చిన కేటీఆర్, తనతోపాటు లాయర్‌ను అనుమతించాలని లింక్ పెట్టారు. అందుకు అధికారులు ససేమిరా అన్నారు. సోమవారం సాయంత్రం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 9న విచారణకు రావాలని అందులో పేర్కొంది. 9 తేదీ నాటికి తనలో లాయర్ తెచ్చుకునేలా కేటీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Read Also: ‘Jana Nayakudu’ : ‘జన నాయకుడు’ కేంద్రాన్ని ప్రారంభించిన చంద్రబాబు