HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Former Minister Patnam Mahender Reddys Strategy Fail

Patnam Mahendar Reddy : బెడిసికొట్టిన మాజీ మంత్రి ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి వ్యూహం

తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నేతలకు సీన్ రివర్స్ అవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు

  • Author : Prasad Date : 25-06-2023 - 10:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Patnam-Mahender-Reddy
Patnam-Mahender-Reddy

తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నేతలకు సీన్ రివర్స్ అవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ వారికి కంటి మీద కునుకు దూరం చేసింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ లో ఉంటూనే పలువురు నేతలు కాంగ్రెస్ లోకి టచ్ లోకి వస్తున్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఇదే ప్రయత్నం చేసారు. తనతో పాటుగా తన మద్దతుదారులకు సీట్ల గురించి మంతనాలు చేసి హమీ పొందరు. అయితే ఇదంతా క‌నిపెట్టిన ప్ర‌గ‌తి భ‌వ‌న్ పెద్ద‌లు.. మ‌హేంద‌ర్ రెడ్డికి ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చింది. అక్క‌డ కూడా హామీలు గుప్పించారు.దీంతో తన స్వలాభం కోసం బీఆర్ఎస్ వైపు ఉండాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు అనుచర వర్గానికి ఇది రుచించటం లేదట‌.

బీఆర్ఎస్ తొలి విడత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పట్నం మహేందర్ రెడ్డి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున తాండూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన సీనియార్టీని దృష్టిలో పెట్టుకొని.. పార్టీ హైకమాండ్ ఆయ‌నకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తాండూర్ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచిన పైలెట్ రోహిత్ రెడ్డి.. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఆయన పార్టీలో క్రియాశీలకంగా మారారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మళ్లీ ఆయనకే టికెట్ ఇస్తుందనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే పట్నం మహేందర్ రెడ్డికి ఛాన్స్ లేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ లో చేరేందుకు పట్నం రూట్ క్లియర్ చేసుకున్నారు.

తనతో పాటుగా తన మద్దతు వర్గానికి సీట్ల పైన కాంగ్రెస్ లో చర్చించారు. అదే సమయంలో కొందరి సీట్ల ఖ‌రారు అంటూ ఒక జాబితా బయట పెట్టారు. అందులో వికారాబాద్ కు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ కు జహీరాబాద్, తీగల అనితకు మహేశ్వరం, కేఎస్ రత్నం కు చేవెళ్ళ, తాండూరు నుంచి మహేందర్ రెడ్డికి ఇవ్వాలని.. మ‌హేందర్ రెడ్డి సతీమణి సునీతరెడ్డికి చేవెళ్ల లోక్ సభ ఇస్తారంటూ వ్యూహాత్మక లీకులు వచ్చాయి. అయితే అంతా ఓకే అనుకుంటున్న సమయంలో రంగారెడ్డి జిల్లాలోని ఒక ఎమ్మెల్సీ ఈ విష‌యాన్ని ప్రగతి భవన్ పెద్ద‌ల‌కు చేర్చారు. అక్కడి నుంచి ఫోన్ రావటంతో పరుగున వెళ్లిన మహేందర్ రెడ్డికి ఆయన పాత చిట్టా బయట పెట్టారు. పార్టీ వీడితే జరిగేది ఏంటో సున్నిత హెచ్చరికలతో స్పష్టత ఇచ్చారు.దీంతో మ‌హేందర్ రెడ్డి జీ హుజూర్ అంటూ గులాబీ తోట లోనే పని చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.

మహేందర్ రెడ్డికి బీఆర్ఎస్‌లో తగిన గుర్తింపు లేదు. తాండూరు ఈ సారి పైలెట్ కు ఖాయం చేస్తూనే మహేందర్ రెడ్డికి ఆశ పెంచారు. అనుచరులు, సన్నిహిత నేతలకు కాంగ్రెస్ లోకి వెళ్దామని చెప్పి..ఇప్పుడు నో అంటూ వారందరికీ మహేందర్ రెడ్డి సమాచారం ఇచ్చారు. కానీ వారంతా బీఆర్ఎస్ నాయకత్వాన్ని మహేందర్ రెడ్డి మాటలను నమ్మేందుకు సిద్ధంగా లేరు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమనే నిర్ణయానికి వచ్చారు. ఎవరికి వారు కాంగ్రెస్ నేతలతో మంతనాలు ప్రారంభించారు. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఈ పరిణామాలు ఊహించని మహేందర్ రెడ్డి వ్యూహం బెడిసి కొట్టింది. ఆయన ప్లాన్స్ అన్నీ బూమ్ రాంగ్ అయ్యాయి. మ‌హేంద‌ర్ రెడ్డికి ఇప్పుడు బీఆర్ఎస్ లోనూ ఇచ్చిన హామీ అమలు అవుతుందా లేదా అనేది సందేహంగానే ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • Chevella
  • cm kcr
  • Patnam Mahender Reddy
  • tandoor

Related News

Mehar Ramesh Event

Tollywood : డైరెక్టర్ మెహర్ ఇంట పెళ్లి సందడి..చిరు , కేటీఆర్ హాజరు !!

మెహర్ రమేష్ కుమార్తెకు, తోట చంద్రశేఖర్ కుమారుడితో వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ కన్వెన్షన్‌లో వీరి నిశ్చయ తాంబూలాల కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి మరియు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక అతిథులుగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు

  • Preethi Reddy

    Preethi Reddy : BJP లో చేరడంపై మల్లారెడ్డి కోడలు క్లారిటీ !!

  • Nsp Driver

    RTC Driver Suicide : శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు.. సర్కార్ చేసిన హత్య – KTR

  • Kavitha

    KCR సభపై కవిత దారుణమైన కామెంట్స్

  • Jeevan Reddy Brs

    BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

Latest News

  • Free Bus : బస్సు ఆపలేదని ఏకంగా డ్రైవర్‌పై దాడి

  • NEET : రేపే NEET అడ్మిట్ కార్డులు విడుదల

  • YCP : సజ్జలకు వైసీపీ బాధ్యతలు?

  • IPL: ధోనీ రికార్డ్ బద్దలుకొట్టిన సంజూ

  • Diesel Shortage : ఏపీలో లీటర్ డీజిల్ రూ.300

Trending News

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    • కొత్త సిలిండర్ బుకింగ్ రూల్స్.. మే 1 నుండి మారనున్న నిబంధనలు?

    • వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో రికార్డులే రికార్డులు!

    • ఐపీఎల్ 2026.. ఒకే రోజు 986 ప‌రుగులు!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd