Akunuri Murali : అక్బరుద్దీన్ ఒవైసీపై మాజీ ఐఏఎస్ ఆగ్రహం
Akunuri Murali : మంత్రి సీతక్కకు హిందీ రాదు అని విమర్శించే అక్బరుద్దీన్ ఒవైసీ, హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన మీకు తెలుగు రాదా? అంటూ మురళీ ప్రశ్నించారు
- By Sudheer Published Date - 05:28 PM, Thu - 27 March 25

తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ (Akunuri Murali) ఆయనపై తీవ్రంగా స్పందించారు. మంత్రి సీతక్కకు హిందీ రాదు అని విమర్శించే అక్బరుద్దీన్ ఒవైసీ, హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన మీకు తెలుగు రాదా? అంటూ మురళీ ప్రశ్నించారు. రాష్ట్రంలో అధిక శాతం ప్రజలు మాట్లాడే భాష తెలుగు అని, అలాంటి భాషను అవమానించడాన్ని ఏ రాష్ట్రపతికైనా తగదని హితవు పలికారు.
Polavaram Project : ఈ ఏడాది చివరి నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి – చంద్రబాబు
తెలంగాణ రాష్ట్ర అధికార భాష తెలుగే అయినా, అసెంబ్లీలో తెలుగు మాట్లాడకుండా ఇతర భాషలకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆకునూరి మురళీ తప్పుబట్టారు. ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను అర్థం చేసుకోవాలంటే రాష్ట్ర అధికార భాషను నేర్చుకోవడం బాధ్యతగా భావించాలని ఆయన సూచించారు. తెలుగు మాట్లాడటంలో అవగాహన లేకుంటే, అసెంబ్లీలో చర్చించే విషయాలు సరైన రూపంలో ప్రజలకు ఎలా చేరతాయి? అని ఆయన ప్రశ్నించారు. ఓ ప్రజాప్రతినిధిగా ఒవైసీకి తెలుగు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
Meher Ramesh : మెగా డైరెక్టర్ ఇంట విషాదం
ఈ వివాదం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుపై పట్టు ఉండటం అనివార్యం అని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ఆకునూరి మురళీ అభిప్రాయాలను సమర్థిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు చేరువగా ఉండాలంటే, వారి భాషను గౌరవించాలి అని అభిప్రాయపడుతున్నారు. అక్బరుద్దీన్ ఒవైసీపై వచ్చిన ఈ విమర్శలపై ఎంఐఎం నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.