Meher Ramesh : మెగా డైరెక్టర్ ఇంట విషాదం
Meher Ramesh : ఆయన సోదరి మాదాసు సత్యవతి (Madasu Satyavathi) గురువారం తుదిశ్వాస విడిచారు
- Author : Sudheer
Date : 27-03-2025 - 5:04 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ (Meher Ramesh) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరి మాదాసు సత్యవతి (Madasu Satyavathi) గురువారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే చికిత్స పొందుతూ ఆమె ఆకస్మికంగా మరణించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మెహర్ రమేష్ కుటుంబానికి సినీ పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Liver: మీ లివర్ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ డ్రింక్స్ తప్పనిసరిగా తాగాల్సిందే?
ఈ విషయం తెలిసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెహర్ రమేష్ కుటుంబంతో తనకు చిన్ననాటి నుంచే మంచి అనుబంధం ఉన్నదని, విజయవాడ మాచవరం ప్రాంతంలో వారు నివసించేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. వేసవి సెలవుల సమయంలో మెహర్ కుటుంబాన్ని సందర్శించేవాడినని, ఆ రోజులను తాను మరచిపోలేనని అన్నారు. సత్యవతి మరణం బాధాకరమని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు.