New DGP : డీజీపీ రేసులో ఐదుగురు ఐపీఎస్‌లు.. ఛాన్స్ ఎవరికో ?
కనీసం 30 ఏళ్ల సర్వీసు, డీజీపీ(New DGP) హోదాలో పనిచేసిన అనుభవం ఉన్న వారికి పూర్తిస్థాయి డీజీపీ అయ్యే అర్హత ఉంటుంది.
- By Pasha Published Date - 09:51 AM, Sun - 13 April 25

New DGP : ప్రస్తుత తెలంగాణ డీజీపీ జితేందర్ సెప్టెంబరులో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో కొత్త డీజీపీ ఎంపికపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందుకు అర్హులైన ఐపీఎస్ అధికారుల సమాచారాన్ని సేకరించి జూన్‌లోగా యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ)కు రాష్ట్ర సర్కారు పంపించనుంది. కనీసం 30 ఏళ్ల సర్వీసు, డీజీపీ(New DGP) హోదాలో పనిచేసిన అనుభవం ఉన్న వారికి పూర్తిస్థాయి డీజీపీ అయ్యే అర్హత ఉంటుంది. తెలంగాణలో ప్రస్తుతం డీజీపీ హోదాలో ఏడుగురు ఐపీఎస్ అధికారులు ఉన్నారు. పదవీ విరమణకు కేవలం 6 నెలల సర్వీసు మిగిలిన అధికారుల పేర్లను కూడా ప్రతిపాదించొచ్చు. డీజీపీగా నియమితులు అయ్యే వారు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. రెండేళ్ల కంటే తక్కువ పదవీకాలం ఉండేవారికి ఆ మేరకు ఎక్స్‌టెన్షన్ సైతం లభిస్తుంది.
Also Read :Rana 3 Demands : ఎన్ఐఏ ఎదుట తహవ్వుర్ రాణా 3 డిమాండ్లు
రేసులో ఉన్నది వీరే..
- తెలంగాణ కొత్త డీజీపీ రేసులో ప్రస్తుత హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా ఉన్నారు. ఈయన 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన 2025 డిసెంబర్‌లో రిటైర్ అవుతారు.
- హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈయనకు 2028 జూన్ వరకు సర్వీసు ఉంది.
- ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈయనకు 2026 ఏప్రిల్ వరకు సర్వీసు ఉంది.
- జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్రా 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈమెకు 2027 డిసెంబర్ వరకు సర్వీసు ఉంది.
- సీఐడీ డీజీ షికా గోయల్ 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈమెకు 2029 మార్చి వరకు సర్వీసు ఉంది.
- వీరి పేర్లను, సర్వీసు రికార్డును యూపీఎస్సీకి తెలంగాణ ప్రభుత్వం పంపనుంది.
- వీరిలో నుంచి ముగ్గుర్ని యూపీఎస్సీ ఎంపానల్ కమిటీ ఎంపిక చేసి, ఆ జాబితాను తెలంగాణ ప్రభుత్వానికి పంపుతుంది. ఆ ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమిస్తుంది.
- సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి సన్నిహితులుగా ఉండే ఐపీఎస్ అధికారులకే డీజీపీగా అవకాశం లభిస్తుంది.